Sourav ganguly: అమ్మాయిలకు సమాన వేతనం.. గంగూలీ స్పందన ఇదీ!

క్రికెట్‌లో లింగ వివక్షను అధిగమిస్తూ బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. 

Published : 28 Oct 2022 23:11 IST

దిల్లీ: పురుష, మహిళా క్రికెటర్ల మధ్య లింగ వివక్షను అధిగమిస్తూ గురువారం బీసీసీఐ ప్రకటించిన నిర్ణయంపై క్రీడాభిమానులు, దిగ్గజ ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్‌లో ఇదో కొత్త శకం అంటూ తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఈ అంశంపై తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. 

‘‘ఉదయం లేవగానే పేపర్‌లో వార్త చూశాను. ఈ అద్భుతమైన ముందడుగు వేసిన అపెక్స్‌ సభ్యులకు, జయ్‌షా, రోజర్‌, రాజీవ్‌ శుక్లా, ఆశిష్‌కి అభినందనలు. మహిళల క్రికెట్‌ ఉన్నతికి ఎంతో కృషి చేశారు. ఆ విషయం వారి ప్రదర్శనలో కనిపిస్తోంది’’ అంటూ ప్రశంసించాడు. మ్యాచ్‌లో పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనం చెల్లించాలని అపెక్స్‌ అత్యవసర సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహిళలకు టెస్టులకు రూ. 4లక్షలు, వన్డే, టీ20 మ్యాచులకు రూ. లక్ష చొప్పున చెల్లించారు. తాజా నిర్ణయం ప్రకారం టెస్టులకు రూ. 15లక్షలు, వన్డేలకు రూ. 6లక్షలు, టీ20లకు రూ. 3లక్షల చొప్పున కేంద్ర బోర్డుతో కాంట్రాక్టు పొందిన క్రికెటర్లు అందుకోనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని