దాదాకు మరో 2 స్టెంట్లు అమర్చిన వైద్యులు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి గురువారం సాయంత్రం యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. పూడుకుపోయిన గుండె రక్తనాళాల్లో మరో రెండు స్టెంట్లను అమర్చామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దాదా ఆరోగ్య పరిస్థితి అత్యంత నిలకడగా ఉందని వెల్లడించాయి....

Published : 28 Jan 2021 19:16 IST

యాంజియోప్లాస్టీ విజయవంతం.. నిలకడగా ఆరోగ్యం

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి గురువారం సాయంత్రం యాంజియోప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. పూడుకుపోయిన గుండె రక్తనాళాల్లో మరో రెండు స్టెంట్లను అమర్చామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దాదా ఆరోగ్య పరిస్థితి అత్యంత నిలకడగా ఉందని వెల్లడించాయి. ‘గంగూలీ గుండెరక్తనాళాల్లో పూడికలు తొలగించేందుకు రెండు స్టెంట్లు అమర్చాం’ అని వైద్యులు పేర్కొన్నారు.

ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో బుధవారం దాదాను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. గురువారం ఆయనకు వరుసగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను విశ్లేషించిన వైద్య బృందం చర్చించి స్టెంట్లు వేసేందుకు నిర్ణయించారు. జనవరి మొదటి వారంలో గుండెనొప్పి రావడంతో గంగూలీ మొదటిసారి ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు అప్పట్లో వైద్యులు గుర్తించారు. సమస్య తీవ్రంగా ఉన్నచోట ఒక స్టెంట్‌ అమర్చారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో మిగతా చోట్ల స్టెంట్‌ వేయడాన్ని వాయిదా వేశారు. బుధవారం కాస్త అసౌకర్యంగా ఉండటంతో రెండోసారి ఆస్పత్రికి వచ్చారు.

ఇవీ చదవండి
బౌలర్లు బౌండరీలు ఇస్తే.. శాస్త్రి అరిచేస్తాడు
థాంక్యూ.. టీమ్‌ఇండియా అంటున్న లైయన్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని