Rishabh Pant: రిషభ్‌ పంత్‌ కోలుకోవాలని.. క్రికెటర్ల పూజలు

న్యూజిలాండ్‌తో మూడో వన్డే కోసం మధ్యప్రదేశ్‌ వచ్చిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకున్నారు. పంత్‌ కోసం వారు ప్రత్యేక పూజలు చేశారు.

Updated : 23 Jan 2023 11:04 IST

ఉజ్జయిని: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమ్‌ఇండియా క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) కోసం తోటి ఆటగాళ్లు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav)‌, కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav)‌, వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar) పూజలు చేశారు. పంత్‌ త్వరగా కోలుకోవాలని మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని ఆలయంలో వీరంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

న్యూజిలాండ్‌తో మూడో వన్డే నిమిత్తం టీమ్‌ఇండియా (Team India) జట్టు మధ్యప్రదేశ్ చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున సూర్యకుమార్‌, కుల్‌దీప్‌, సుందర్‌తో పాటు భారత క్రికెట్‌ జట్టు స్టాఫ్‌ ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. పరమశివుడికి భస్మా హారతి సమర్పించారు. ఈ సందర్భంగా సూర్యకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘రిషభ్‌ పంత్‌ త్వరగా కోలుకోవాలని మేం ఆ భగవంతుడిని ప్రార్థించాం. అతడు జట్టులోకి తిరిగిరావడం టీమ్‌ఇండియాకు చాలా ముఖ్యం’’ అని తెలిపాడు.

ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఇప్పటికే తాము గెలుచుకున్నామని, మూడో వన్డేలో గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆశిస్తున్నట్లు స్కై చెప్పాడు. ఇందౌర్‌ వేదికగా భారత్‌, కివీస్‌ మధ్య మంగళవారం చివరి వన్డే జరగనుంది.

గతేడాది డిసెంబరు 30న రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు