Sergio: రిటైర్మెంట్‌ ప్రకటిస్తూ కన్నీటిపర్యంతమైన స్టార్‌ ఫుట్‌బాలర్‌

అనారోగ్య కారణాలతో ఓ స్టార్‌ ఫుట్‌బాలర్‌ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసింది. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు ప్రధాన స్ట్రైకర్‌ సెర్జియో ఆగెరో (33) బుధవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు......

Published : 15 Dec 2021 20:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనారోగ్య కారణాలతో ఓ స్టార్‌ ఫుట్‌బాలర్‌ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసింది. అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టు ప్రధాన స్ట్రైకర్‌ సెర్జియో ఆగెరో (33) బుధవారం రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అనారోగ్యం కారణంగానే ఆటకు అర్ధాంతరంగా గుడ్‌బై చెప్పాల్సి వస్తోందని కన్నీటిపర్యంతమయ్యాడు. గుండె సమస్య ఉందని వైద్యులు వెల్లడించిన నెల రోజులకే సెర్జియో ఈ నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఫుట్‌బాల్‌ ఆటకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఇవి కఠిన క్షణాలు కానీ, నా నిర్ణయంతో సంతోషంగా ఉన్నా. ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత’ అని ఉబికివస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ వెల్లడించాడు.

ప్రస్తుతం బార్సిలోనా జట్టుకు ఆడుతున్న సెర్జియో.. గత అక్టోబర్‌లో లాలిగా టోర్నీలో పాల్గొంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండె నొప్పితో బాధపడుతూ, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడ్డాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా కోలుకున్నాడు. బార్సిలోనా జట్టులో చేరేకంటే ముందు పదేళ్లపాటు మాంచెస్టర్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని