IND vs SA : గబ్బాలో ఆరంభం.. సెంచూరియన్‌లో ముగింపు.. విదేశాల్లో టీమ్ఇండియా విజయ పరంపర.!

ఈ ఏడాది ఆరంభంలోనే గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది భారత జట్టు. అలాగే, దక్షిణాఫ్రికాను సైతం సెంచూరియన్‌లో ఓడించి ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు

Published : 30 Dec 2021 23:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ ఏడాది ఆరంభంలోనే గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది భారత జట్టు. అలాగే, దక్షిణాఫ్రికాను సైతం సెంచూరియన్‌లో ఓడించి ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికింది. మొత్తం మీద ఈ ఏడాది టీమ్‌ఇండియా విదేశాల్లో నాలుగు (గబ్బా, లార్డ్స్‌, ఓవల్‌, సెంచూరియన్‌) విజయాలు సాధించింది. సెంచూరియన్‌లో భారత్‌ సాధించిన విజయంపై మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సచిన్ టెండూల్కర్‌, వీవీఎస్ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా తదితరులు స్పందించారు. టీమ్‌ఇండియా సాధించిన చారిత్రక విజయంపై ప్రశంసలు కురిపించారు.

మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియా ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో సఫారీలను భారత జట్టు 113 పరుగుల తేడాతో ఓడించింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జొహాన్నెస్‌ బర్గ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

Read latest Sports News and Telugu News










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని