Sourav Ganguly:  ఒకానొక సమయంలో ద్రవిడ్‌పై ఆశలు వదులుకున్నాం: గంగూలీ

టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను ఒప్పించడం చాలా కష్టమైందని, ఒకానొక సమయంలో ఆశలు వదులుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపారు...

Published : 06 Dec 2021 10:09 IST

అతడిని కోచ్‌గా ఒప్పించడం చాలా కష్టమైంది

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను ఒప్పించడం చాలా కష్టమైందని.. ఒకానొక సమయంలో ఆశలు వదులుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపారు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి టర్మ్‌ పూర్తికావడంతో రాహుల్‌ ద్రవిడ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అతడిని ఒప్పించడానికి చాలా సార్లు ప్రయత్నించానని గంగూలీ వివరించాడు.

‘శాస్త్రి తర్వాత భారత హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను నియమించాలని నేను, జైషా చాలాకాలంగా అనుకుంటున్నాం. ఈ విషయంపై నా సహచర ఆటగాడిని ఎన్నోసార్లు సంప్రదించాం. అయితే, అందుకు ద్రవిడ్‌ నిరాకరించాడు. అతడికి ఇద్దరు ఎదిగే పిల్లలు ఉండటంతో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టమని భావించి అంగీకరించలేదు. దీంతో ఒకానొక సందర్భంలో ఓపిక నశించి ఆశలు వదులుకున్నాం. మళ్లీ అతడిని ఎన్‌సీఏ హెడ్‌గా కొనసాగించడానికి సిద్ధమయ్యాం. అయినా.. పదే పదే టీమ్‌ఇండియా కోచ్‌గా ఉండాలంటూ కోరుతూనే ఉన్నాం. అదే సమయంలో ఆటగాళ్లు ఎలాంటి కోచ్‌ను కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నాం. వాళ్లు కూడా రాహుల్‌ లాంటి వ్యక్తి ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని అతడికి వివరించా. కుటుంబానికి దూరంగా ఉండటం కష్టమే అయినా రెండేళ్ల పాటు తొలుత పనిచెయ్‌. ఒకవేళ నీకు అనుకూలంగా లేకపోతే వేరే ప్రయత్నాలు మొదలుపెడదాం’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని