Space olympics : అంతరిక్షంలో వ్యోమగాముల ఆటలు.. చూస్తారా..

ఈ భూమిపైన నిర్వహించే అతి పెద్ద క్రీడల ఈవెంట్‌ ఒలింపిక్స్‌. కరోనా కఠిన పరిస్థితుల్లోనూ.. 17 రోజుల పాటు విశ్వ క్రీడల సంబరాన్ని ప్రపంచానికి

Published : 10 Aug 2021 15:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ భూమిపైన నిర్వహించే అతి పెద్ద క్రీడల ఈవెంట్‌ ఒలింపిక్స్‌. కరోనా కఠిన పరిస్థితుల్లోనూ.. 17 రోజుల పాటు విశ్వ క్రీడల సంబరాన్ని టోక్యో ఒలింపిక్స్ ప్రపంచానికి అందించింది. ఈ పోటీలు ఇటీవలే ఘనంగా ముగిశాయి. ఈ క్రీడలకు మన భూమిపైనే కాదు.. అటు అంతరిక్షంలోనూ క్రేజ్‌ ఉందని మీకు తెలుసా..?. ‘స్పేస్‌ ఒలింపిక్స్‌’ పేరుతో అంతరిక్షంలోనూ వీటిని నిర్వహించారు మరి!

ఓ వైపు టోక్యోలో క్రీడల నిర్వహణ జరుగుతుంటే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో వ్యోమగాములు జట్లుగా మారి ఆటలు ఆడారు. భార రహిత స్థితిలో తమకు అనువైన పద్ధతిలో ఆటలాడుతూ స్పేస్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించారు.

ఐఎస్‌ఎస్‌లో ఉంటున్న జపనీస్‌ వ్యోమగామి అకిహికో హోషైడ్‌, ఫ్రెంచ్‌ వ్యోమగామి థామస్‌ వీటిని నిర్వహించారు. ఆస్ట్రొనాట్లు రెండు బృందాలుగా విడిపోయి పోటీపడ్డారు. జీరోగ్రావిటీలోనూ తామేమీ తీసిపోమంటూ నిరూపించారు. చక్కటి నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. సింక్రనైజ్‌డ్‌ ఫ్లోటింగ్‌, వెయిట్‌లెస్‌ షార్ప్‌ షూటింగ్‌, నో హ్యాండ్‌ బాల్‌ పోటీలతో అలరించారు. చివరగా వీటికి వీడ్కోలు వేడుకలూ అంతే ఉత్సాహంగా నిర్వహించడం మరో విశేషం.

ఎంతో సరదాగా సాగిన ఈ ఆటలకు సంబంధించిన వీడియోలను థామస్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. వీటిని చూసిన నెటిజన్లు ఔరా..! అంటున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వెంటనే వీటికి మిలియన్ల కొద్దీ వ్యూస్‌.. వేల కొద్దీ లైకులు వచ్చి పడ్డాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని