Virat Kohli: కోహ్లీ అలా అనడం.. బీసీసీఐకి నచ్చలేదేమో: గావస్కర్‌

టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ సెప్టెంబర్‌లో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే నిర్ణయం ప్రకటించినప్పుడు చేసిన వ్యాఖ్యలే బీసీసీఐకి నచ్చకపోయి ఉండొచ్చని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 16 Dec 2021 15:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ సెప్టెంబర్‌లో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే నిర్ణయం ప్రకటించినప్పుడు చేసిన వ్యాఖ్యలే బీసీసీఐకి నచ్చకపోయి ఉండొచ్చని మాజీ సారథి, దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. అందుకే ఇప్పుడు అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి ఉంటారని చెప్పాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన గావస్కర్‌.. కోహ్లీ వివాదంపై స్పందించాడు.

ఈ ఏడాది యూఏఈలో ఐపీఎల్‌ జరుగుతున్న సమయంలో కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా టీ20 సారథిగా తప్పుకొంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసి.. ఇకపై టెస్టులు, వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేస్తానని చెప్పాడు. ఆ వ్యాఖ్యలే బీసీసీఐ పెద్దలకు నచ్చకపోయి ఉండొచ్చు. కోహ్లీ అలా అనకుండా.. ఇంకాస్త మంచి పదాలు ఉపయోగించి ఉండాల్సింది. టీ20ల నుంచి తప్పుకొంటానని చెబుతూనే.. ఇకపై వన్డేలు, టెస్టులకు నాయకత్వం వహించడానికి అందుబాటులో ఉంటానని అనాల్సింది’ అని గావస్కర్‌ చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క లైన్‌ దీనంతటికీ కారణం అయిఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ వివాదానికి తెరదించాలంటే.. అసలేం జరిగిందో చెప్పడానికి గంగూలీ, కోహ్లీ.. ఇద్దరూ మీడియా ముందుకు రావాలని కోరాడు. దీంతో అందరిలో నెలకొన్న సందేహాలకు స్పష్టత వస్తుందని గావస్కర్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని