Published : 22 Feb 2021 01:23 IST

తెవాతియా.. సెలక్టయ్యాడు.. చితక్కొట్టాడు!

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియాకు ఎంపికయ్యాననే శుభవార్త తెలిసిన తర్వాత రాహుల్‌ తెవాతియా చెలరేగిపోయాడు. చండీగఢ్‌పై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీలో హరియాణా తరఫున ఆడుతున్న తెవాతియా.. చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 39 బంతుల్లో 73 పరుగులు చేశాడు. దీనిలో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు హిమన్షు రాణా శతకంతో రాణించడంతో హరియాణా 50 ఓవర్లలో 9 వికెట్లకు 299 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్‌తో జరగనున్న అయిదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న తెవాతియాతో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషాన్‌ కూడా టీమిండియాకు ఎంపికయ్యారు. కాగా, ఎంపికపై తెవాతియా స్పందించాడు. భారత జట్టుకు ఎంపికయ్యాననే విషయం తొలుత చాహల్ చెప్పినప్పుడు నమ్మలేదన్నాడు. ఆ తర్వాత మోహిత్‌ శర్మ కూడా చెప్పడంతో సెలక్టైన విషయాన్ని తెలుసుకున్నానని తెలిపాడు. మరోవైపు సూర్యకుమార్ తన ఎంపిక వార్త తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని