Viral Video: 40వేల అడుగుల ఎత్తులోను తగ్గని ఫిఫా క్రేజ్!
ప్రపచంలో జరిగే క్రీడల మెగా టోర్నీలో ఫిఫా వరల్డ్ కప్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఎక్కడున్నా మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. ప్రస్తుతం ఫుట్‌బాల్ మెగా టోర్నీ ఫిపా వరల్డ్‌కప్ 2022 జరుగుతోంది. తమ అభిమాన జట్ల ఆటను చూసేందుకు ఎంతో మంది అభిమానులు తహతహలాడిపోతుంటారు. కానీ, అందరికీ ప్రత్యక్షంగా చూసే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే టీవీ, కంప్యూటర్, మొబైల్.. తమకు అందుబాటులో ఉన్న మాధ్యమం ద్వారా మ్యాచ్‌లన వీక్షిస్తుంటారు. మరి, విమానంలో ప్రయాణించే వారి పరిస్థితి ఏంటి? ఈ సమస్యకు పరిష్కారంగా విమానయాన సంస్థలు మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. తాజాగా ఓ విమానంలో ఉన్న ప్రయాణికులందరూ స్క్రీన్‌లలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగింది, అది ఏ విమానయాన సంస్థ అనే వివరాలను మాత్రం ప్రస్తావించలేదు.
ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభమైనప్పటి నుంచి ఎతిహాద్, ఖతార్, జెట్ బ్లూ, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సహా మరికొన్నిఅంతర్జాతీయ విమాయాన సంస్థలు ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు గాల్లో కూడా తమకు ఇష్టమైన ఆటను ఆస్వాదిస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘40 వేల అడుగుల ఎత్తులోనూ ఫుట్‌బాల్‌కు తగ్గని క్రేజ్’, ‘ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానించే ఆట ఇదే’, ‘గోల్ కొట్టినప్పుడు విమానంలో పరిస్థితి ఊహించడం కష్టం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: 24 గంటల ఫ్రీ కరెంట్.. నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా: ఈటల రాజేందర్
-
India News
Ayodhya: సాలగ్రామమై అవతరించిన శ్రీమహావిష్ణువు.. అయోధ్యకు చేరుకున్న వేళ..
-
Politics News
Pawan kalyan: ఫోన్ ట్యాపింగ్.. ప్రాణభయంతో వైకాపా ఎమ్మెల్యేలు: పవన్ కల్యాణ్
-
Sports News
IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్ హీలీ
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం