Virat Kohli: ఆ వంటకాన్ని నేను ఇప్పటివరకు తినలేదు.. వాటితో ప్రయోగాలు చేస్తా: కోహ్లీ

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) తన జీవితంలో ఇప్పటివరకు తినని వంటకమెంటో బయటపెట్టాడు. 

Updated : 20 Feb 2023 19:01 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మంచి ఆహార ప్రియుడు. తన ఆహారపు అలవాట్లతోనే ఫిట్‌గా ఉన్నానని, అయితే ఒకప్పుడు అన్ని రకాల జంక్‌ఫుడ్‌ని తిన్నానని చెప్పాడు. కోహ్లీకి దిల్లీ వంటకాలంటే ఎంతో ఇష్టం. ఇక ‘చోలే బటూరే’(Chole Bhature) అంటే మనసు పారేసుకుంటాడు. ఇటీవల ఆసీస్‌తో రెండో టెస్టు జరుగుతున్నప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) తో కోహ్లీ ఏదో చర్చిస్తుండగా.. సిబ్బంది ఒకరు ఫుడ్‌ తీసుకొని వచ్చారు. ఆ వంటకం వైపు చూస్తూ కోహ్లీ.. వావ్‌ అంటూ చప్పట్లు కొట్టడం లైవ్‌లో కనిపించింది. అది కచ్చితంగా కోహ్లీ ఇష్టపడే ‘చోలే బటూరే’నే అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టారు.ఈ నేపథ్యంలో కోహ్లీ తాజాగా ఓ వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తన జీవితంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా తినని ఆహార పదార్థమేంటో చెప్పాడు.  

‘నేను ఇప్పుడు శాకాహారిని. నాకు కాకరకాయలంటే పడదు. ఇప్పటివరకు ఆ వంటకాన్ని తినలేదు. నేను తిన్న విచిత్రమైన వంటకం ఏంటంటే.. మలేసియాలో ఒక రకమైన పురుగు. వేయించిన ఆ వంటకాన్ని తిన్నాను. ఆ  తర్వాత అసహ్యించుకున్నాను’అని విరాట్ వెల్లడించాడు. చిరు తిళ్లలో ‘చోలే బటూరే’ ఇష్టమని తెలిపాడు. ఫ్యాషన్‌ విషయంలో చేసిన తప్పు గురించి  చెప్పాడు. ‘గతంలో ఓ రోజు.. నేను హీల్‌ ఉండే షూస్ వేసుకున్నా.  ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. అలాంటి షూస్‌ను నేను మళ్లీ వేసుకోవడం కూడా ఊహించలేను. ప్రింటెడ్ షర్టులతో ప్రయోగాలు చేస్తా. కొన్నిసార్లు ఆ ప్రయోగాలు బెడిసికొడతాయి. పై నుంచి కింది వరకు కప్పి ఉండే దుస్తులు నాకు సౌకర్యవంతంగా అనిపించవు’ అని కోహ్లీ వివరించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని