IND vs BAN: విరాట్‌ కోహ్లీది 100 శాతం ఫేక్‌ ఫీల్డింగ్‌ : ఆకాశ్ చోప్రా

భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో కోహ్లీ నిజంగానే ఫేక్‌ ఫీల్డింగ్‌ చేశాడని, ఈ విషయాన్ని మైదానంలో ఉన్న అంపైర్లు గుర్తించకపోవడంతో భారత్‌కు లాభం చేకూరిందని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. 

Published : 05 Nov 2022 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ ఎంత ఉత్కంఠ రేపిందో.. ఇప్పుడు విరాట్ కోహ్లీ ‘ఫేక్‌ ఫీల్డింగ్‌’ అంటూ సోషల్‌ మీడియాలో రాద్ధాంతం కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. కోహ్లీ ఫేక్‌ ఫీల్డింగ్‌ చేశాడంటూ బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు, అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు.  తాజాగా ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కూడా చేరాడు. కోహ్లీ నిజంగానే ఫేక్‌ ఫీల్డింగ్‌ చేశాడని, ఈ విషయాన్ని మైదానంలో ఉన్న అంపైర్లు గుర్తించకపోవడంతో భారత్‌కు లాభం చేకూరిందని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ సంఘటనను అంపైర్లు చూసి ఉంటే నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్‌కు  అదనంగా ఐదు పరుగులు ఇచ్చేవారని పేర్కొన్నాడు.

‘అవును అది 100 శాతం ఫేక్ ఫీల్డింగ్. ఎందుకంటే కోహ్లీ చేతిలో బంతి లేకుండానే నాన్‌స్ట్రైకర్‌ వైపు త్రో చేసినట్లు యాక్ట్‌ చేశాడు. అతడు చేసిన ఈ పనిని అంపైర్లు గమనించి ఉంటే భారత్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించేవారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మన జట్టు (భారత్‌) ఐదు పరుగుల తేడాతో గెలిచింది. కాబట్టి ఇక్కడ మనం తప్పించుకున్నాం. కానీ, ఇంకొకసారి ఎవరైనా ఇలా చేస్తే అప్పుడు అంపైర్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. దీన్ని బట్టి చూస్తే బంగ్లాదేశ్ వాదన సరైనదే. కానీ, అప్పుడు ఈ సంఘటను ఎవరూ గమనించలేదు. కాబట్టి.. ఇప్పుడేం చేయలేం’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని