Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?
భారత క్రికెట్లో సచిన్-సౌరభ్ గంగూలీ ఓపెనింగ్ జోడీ ఎంతో ఫేమస్.. అలానే సచిన్-వీరేంద్ర సెహ్వాగ్ పార్టనర్షిప్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. వీరంతా తమ కెరీర్‌ను...
సెహ్వాగ్‌కు అక్తర్ ప్రశ్న.. ఆటగాడి పేరును వెల్లడించిన వీరూ
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్లో సచిన్-సౌరభ్ గంగూలీ ఓపెనింగ్ జోడీ ఎంతో ఫేమస్.. అలానే సచిన్-వీరేంద్ర సెహ్వాగ్ పార్టనర్షిప్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. వీరంతా తమ కెరీర్‌ను మిడిలార్డర్ స్థానం నుంచి ప్రారంభించినవారే కావడం విశేషం. సచిన్, గంగూలీ అయినా కాస్త ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టేవాళ్లు.. కానీ, వీరేంద్ర సెహ్వాగ్ (వీరూ) మాత్రం తొలి బంతి నుంచే విరుచుకుపడేవాడు. మరీ ముఖ్యంగా పాక్‌పై వీరవిహారమే చేసేవాడు. అది వన్డేనా..? టెస్టు మ్యాచ్ ఆడుతున్నామా అనే తేడా ఉండదు. బరిలోకి దిగితే బంతిని ఉతకడమే సెహ్వాగ్‌కు తెలుసు. అలా టెస్టుల్లో రెండు ట్రిబుల్ సెంచరీలను నమోదు చేశాడు. అసలు ఇంతకీ తనను మిడిలార్డర్ నుంచి ఓపెనింగ్‌కు పంపితే బాగుండని సూచించిన ఆటగాడు ఎవరో సెహ్వాగ్ వెల్లడించాడు.
ఇప్పటి వరకు చాలామంది అభిమానులు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీనే తీసుకొచ్చాడేమోనని భావించేవాళ్లు ఉన్నారు. అయితే.. గంగూలీ నాయకత్వంలోనే సెహ్వాగ్ ఓపెనర్‌గా వచ్చాడు. కానీ, తన పేరును మరొక కీలక ప్లేయర్ సూచించాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానల్లో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌తో సెహ్వాగ్ ప్రత్యేక చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్‌ను అక్తర్ ఓ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ‘‘నిన్ను ఓపెనింగ్‌కు పంపించాలనేది ఎవరి ఐడియా?’’.. దీనికి సమాధానంగా ‘‘ఇన్నింగ్స్‌ను ప్రారంభించే స్థానంలో నన్ను దింపాలనేది అప్పటి టీమ్ఇండియా పేసర్ జహీర్ ఖాన్ ఐడియా. ఇదే విషయాన్ని కెప్టెన్‌గా ఉన్న సౌరభ్ గంగూలీకి చెప్పాడు. నేను అప్పటి వరకూ మిడిలార్డర్లోనే ఆడేవాడిని. అంతేకాకుండా తొలిసారి నిన్ను (షోయబ్) 1999లో మిడిలార్డర్ బ్యాటర్‌గానే ఎదుర్కొన్నా’’ అని సెహ్వాగ్ వివరించాడు. ఇప్పుడు తెలిసింది కదా.. సెహ్వాగ్ వీరవిహారం వెనుక ఉన్న మాస్టర్ మైండ్..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్‌కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్‌నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్‌పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్‌లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్‌కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్‌ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
-
పలు స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర