LPG Price: తగ్గిన వంటగ్యాస్‌ వాణిజ్య సిలిండర్‌ ధర

LPG Price: 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి.

Updated : 01 May 2024 09:50 IST

దిల్లీ: హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price) తగ్గింది. 19 కిలోగ్రాముల సిలిండరుపై చమురు విక్రయ సంస్థలు రూ.19 తగ్గించాయి. దిల్లీలో ధర రూ.1,764.50 నుంచి రూ.1,745.50కు చేరింది. హైదరాబాద్‌లో ఈ ధర రూ.1,994.50గా ఉంది. గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.855 వద్ధ స్థిరంగా కొనసాగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సైతం సవరించలేదు.

గత నెలలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వాణిజ్య సిలిండర్‌ ధరను (Commercial LPG Cylinder Price) రూ.30.50 తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు మార్చిలో రూ.25.50, ఫిబ్రవరిలో రూ.14 పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లోని కదలికలకు అనుగుణంగా దేశీయంగానూ కంపెనీలు ప్రతినెలా ధరలను సవరిస్తుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని