wasim jaffer: ప్రపంచకప్‌లో అలా జరగదని ఆశిస్తున్నా: వసీం

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మూడు సిరీస్‌ల టీ20 మ్యాచ్‌ సందర్భంగా పిచ్‌ బౌండరీ లైన్‌ను తగ్గించడంపై మాజీ టీమ్‌ఇండియా క్రికెటర్‌ వసీం జాఫర్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

Published : 10 Oct 2022 01:09 IST

దిల్లీ: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మూడు సిరీస్‌ల టీ20 మ్యాచ్‌ సందర్భంగా పిచ్‌ బౌండరీ లైన్‌ను తగ్గించడంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌ ముంగిట స్టేడియం అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ మైదానం తన ప్రత్యేకతను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. 

‘‘ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను గణనీయంగా తగ్గించారు. ఇది ప్రపంచకప్‌ సమయంలో పునరావృతం కాకూడదని  ఆశిస్తున్నా. పెద్ద మైదానాలు, బౌండరీలే ఇక్కడ ఆటను ప్రత్యేకంగా మారుస్తాయి’’అంటూ ట్విటర్‌ వేదికగా తెలిపాడు. ఆసీస్‌ పిచ్‌లు పూర్తిగా భిన్నమైనవి. ఇక్కడ బ్యాటింగ్‌ ఓ సవాలు. దీంతో ఎక్కువ పరుగులు రాబట్టేందుకు వీలుగా అధికారులు బౌండరీ లైన్‌ను తగ్గించారు. ప్రపంచకప్‌నకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని