Wasim Jaffer: రఫా గెలవడం ఇంత తేలిక.. జాఫర్‌ ఫన్నీ వీడియో వైరల్

టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ తన కెరీర్‌లో 22వ గ్రాండ్‌ స్లామ్‌ సాధించడంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ స్పందించాడు...

Published : 07 Jun 2022 02:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ తన కెరీర్‌లో 22వ గ్రాండ్‌ స్లామ్‌ సాధించడంపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ స్పందించాడు. తనదైనశైలిలో ఓ ట్వీట్‌ చేస్తూ నెటిజన్లను మరోసారి ఆకట్టుకున్నాడు. ఎర్రమట్టి కోటలో తిరుగులేని రికార్డు సొంతం చేసుకున్న రఫా ఆటను.. జాఫర్‌ ఓ సరదా వీడియోతో పోల్చిచూపాడు. అది చాలా సరదాగా ఉండటంతో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో గెలవడం రఫెల్‌కు చాలా తేలికని, అది ఎలా ఉంటుందనేదానికి ఓ టేబుల్‌ టెన్నిస్‌ వీడియోను జాఫర్‌ పంచుకున్నాడు. అందులో వయసుపైబడిన వ్యక్తి ఒకే చోట నిల్చొని ఆడుతుండగా, మరోవైపు ప్రత్యర్థి ఆటగాడు అటు ఇటు పరుగులు పెడుతూ ఎంతో శ్రమించి ఆడుతుంటాడు. అయినా, చివరికి పెద్దాయనే సునాయాస విజయం సాధిస్తాడు. రఫెల్‌ కూడా అంతే తేలికగా మ్యాచ్‌ గెలవచ్చని చూపిస్తాడని జాఫర్‌ దానికి వ్యాఖ్యానం జతచేశాడు. ఈ సందర్భంగా నాదల్‌ 14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకోవడంపై ప్రత్యేకంగా అభినందించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని