IND vs BAN: 20 వికెట్లు పడగొడతాం: బంగ్లాతో మ్యాచ్‌పై కేఎల్‌ రాహుల్‌ ధీమా

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో తప్పకుండా 20 వికెట్లు పడగొడతామని కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(KL Rahul) ధీమా వ్యక్తం చేశాడు. 

Published : 14 Dec 2022 11:16 IST

చట్‌గావ్‌: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం చట్‌గావ్‌ వేదికగా టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌ ఆడుతోంది. తొలి టెస్టు(IND vs BAN)లోనే వికెట్లు పడగొట్టి టీమ్‌ఇండియా ఆటగాళ్లపై ఒత్తిడి తెస్తామని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకిబ్‌ అల్‌ హసన్‌(Shakib al hasan) ధీమా వ్యక్తం చేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతరం భారత జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కనీసం 20 వికెట్లు తీయడమే లక్ష్యంగా ఆడతామని పేర్కొన్నాడు. గాయం కారణంగా రోహిత్‌ శర్మ జట్టుకు దూరమవగా.. రాహుల్‌(KL Rahul)కి టీమ్‌మేనేజ్‌మెంట్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇక తొలి మ్యాచ్‌లో రోహిత్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకున్నారు. 

‘‘మంచి పరుగులు సాధిస్తూనే వికెట్లు పడగొట్టడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కనీసం 20 వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాం. గాయాల కారణంగా మా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా మరికొందరు ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు. అయినా, దీనివల్ల కొత్తవారికి ఆడే అవకాశం లభిస్తోంది. అందరూ ఎంతో కొంత క్రికెట్‌ ఆడిన వారే. వారంతా ఈసారి జట్టును గెలిపించడానికి ఉత్సాహంగా ఉన్నారు’’ అని కేఎల్‌ రాహుల్‌ తెలిపాడు. జట్టులో ప్రస్తుతం అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ వంటి ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం దక్కింది. తొలి టెస్టు మ్యాచ్‌లో పేసర్లుగా మహమ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని