WTC Final : అసలేం జరుగుతోంది..? సిరాజ్‌పై గావస్కర్ అసహనం..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండో రోజు ఆట ప్రారంభమైన సమయంలో సిరాజ్(Mohammed Siraj) ప్రవర్తనపై మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ñ
ఇంటర్నెట్ డెస్క్ : డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final)లో ప్రస్తుతం ఆస్ట్రేలియా(australia)దే పైచేయిగా ఉన్నప్పటికీ.. మొదటి రెండు రోజులతో పోల్చితే టీమ్‌ఇండియా(Team India) కాస్త మెరుగైన ప్రదర్శన చేసిందనే చెప్పాలి. అయితే.. రెండో రోజు ఆట ప్రారంభమైన సమయంలో టీమ్‌ఇండియా పేసర్ సిరాజ్(Mohammed Siraj).. ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్యాటర్ సిద్ధంగా లేనప్పుడు.. స్మిత్(Steve Smith) వైపు సిరాజ్ బంతిని విసిరాడు. దీంతో అతడి ప్రవర్తనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ ఘటనపై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఏం జరుగుతోంది?’ అంటూ కామెంట్రీలో తీవ్రంగా స్పందించాడు. ఇక ఈ ఘటనపై మరో మాజీ దిగ్గజం రవిశాస్త్రి (Ravi Shastri) స్పందిస్తూ.. స్మిత్‌కే మద్దతు తెలిపాడు. బంతి పడకముందు.. పక్కకు జరిగే హక్కు బ్యాట్స్‌మన్‌కు ఉందని చెప్పాడు.‘ స్మిత్ కాస్త పక్కకు జరిగాడు. అయితే అది సిరాజ్‌కు నచ్చలేదు. కానీ.. ఆ సమయంలో పక్కకు జరిగే హక్కు స్మిత్‌కు ఉంది. స్మిత్ రెండు బౌండరీలు బాదడంతో సిరాజ్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్లు కనిపించింది’ అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు.
అసలేం జరిగిందంటే..
రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత తొలి ఓవర్‌ను సిరాజ్ వేశాడు. అప్పటికే 95 పరుగులతో ఆడుతున్న స్మిత్.. రెండు, మూడు బంతుల్లో వరుసగా ఫోర్లు బాది తన శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్ నాలుగో బంతి వేయడానికి ముందు.. స్పైడర్ క్యామ్ కారణంగా స్మిత్ కాస్త పక్కకు జరిగాడు. అయితే.. సిరాజ్ ఆగకుండా స్మిత్‌కు పక్కగా బంతిని విసిరాడు. దీంతో ఇది వివాదానికి దారి తీసింది.
ఇది ఏమంత పెద్ద విషయం కాదు.. : సిరాజ్
ఈ ఘటనపై సిరాజ్ కూడా స్పందించాడు. ‘ఇది ఏమంత పెద్ద విషయం కాదు. నేను ఎంజాయ్ చేశాను’ అంటూ పేర్కొన్నాడు. ‘రెండో రోజు పిచ్‌లో ఎక్కువ పేస్, బౌన్స్ ఉంది. మేం కూడా బాగానే బౌలింగ్ చేశాం. కానీ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేసిన విధానంతో మా బౌలింగ్‌లో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. నా బౌలింగ్‌లోనే నాలుగైదు అవకాశాలు వచ్చాయి. మేం బాగా బౌలింగ్ చేయకపోతే.. ఆసీస్ స్కోరు 500 దాటి ఉండేది’ అని సిరాజ్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన