IPL 2024: ఆ కారణంతో ముంబయి మ్యాచ్‌లను సగమే చూసేవాడిని: సూర్యకుమార్ యాదవ్

ఐపీఎల్‌ 17 సీజన్‌లో ముంబయి ఆడిన మొదటి మూడు మ్యాచ్‌లను సగమే చూశానని ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేర్కొన్నాడు. అందుకు గల కారణాలను అతడు వివరించాడు. 

Updated : 10 Apr 2024 18:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-17లో ముంబయి ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఆడలేదు. కొన్ని రోజుల కిందట అతడు మోకాలి గాయానికి, స్పోర్ట్స్ హెర్నియాకు   శస్త్రచికిత్సలు చేయించుకుని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో చేరాడు. అక్కడ  ఫిట్‌నెస్‌ పరీక్షలు పాసై దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. కానీ, డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపర్చాడు. ప్రస్తుతం ఈ బ్యాటర్ ఏప్రిల్ 11న బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈసందర్భంగా ఐపీఎల్‌ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో సూర్యకుమార్‌ మాట్లాడాడు. ఇందులో తన రికవరీ ప్రాసెస్‌ గురించి వివరించాడు.  రికవరీ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో తన దినచర్యను కొంచెం మార్చుకోవాల్సి వచ్చిందన్నాడు. 

‘‘మనం ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు గదిలో కూర్చుని ఆటను చూడటం ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. నేను మ్యాచ్‌లను చూడలేదని చెప్పలేను. కానీ, సగం మ్యాచ్‌లను చూశాను. ఎందుకంటే నేను బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్నప్పుడు సమయానికి నిద్రపోయాను. ప్రతిరోజు రాత్రి 10:30 - 12:45 గంటల మధ్య పడుకుని ఉదయం తొందరగా నిద్ర లేచేవాడిని. ఈ కారణంగా ముంబయి మ్యాచ్‌లను సగమే చూశా. మిగిలిన ఆటను మరుసటి రోజు చూశాను’’ అని సూర్యకుమార్ పేర్కొన్నాడు. తన భార్య, ఎన్‌సీఏ సిబ్బంది సూచనలతో మంచి ఆహారం తీసుకుని సమయానికి నిద్రపోవడం వల్ల తొందరగా కోలుకున్నానని చెప్పాడు. గతంలో తాను పుస్తకాలు ఎప్పుడూ చదవలేదని, ఎన్‌సీఏలో ఉండి బుక్‌ రీడింగ్‌ కూడా ప్రారంభించానని సూర్య తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని