మళ్లీ మైదానంలోకి ‘ఇండియా లెజెండ్స్‌’

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు యూసుఫ్‌ పఠాన్‌, నమన్‌ ఓజా, వినయ్‌కుమార్‌ మళ్లీ ‌మైదానంలో అడుగు పెట్టనున్నారు. ఆయా దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు తలపడుతున్న ‘రహదారి భద్రతా ప్రపంచ సిరీసు’లో భాగస్వాములు కానున్నారు. ఈ మధ్యే అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటించిన వీరంతా...

Published : 27 Feb 2021 17:28 IST

రాయ్‌పుర్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు యూసుఫ్‌ పఠాన్‌, నమన్‌ ఓజా, వినయ్‌కుమార్‌ మళ్లీ ‌మైదానంలో అడుగు పెట్టనున్నారు. ఆయా దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు తలపడుతున్న ‘రహదారి భద్రతా ప్రపంచ సిరీసు’లో భాగస్వాములు కానున్నారు. ఈ మధ్యే అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటించిన వీరంతా ‘ఇండియా లెజెండ్స్‌’ తరఫున ఆడనున్నారు. మార్చి 5 నుంచి ఈ సిరీసు మొదలవ్వనుంది.

1996 ప్రపంచకప్‌ విజేత, శ్రీలంక దిగ్గజం సనత్‌ జయసూర్య సైతం శ్రీలంక లెజెండ్స్‌ తరఫున ఆడనున్నాడు. అంతేకాకుండా రసెల్‌ ఆర్నాల్డ్‌, ఉపుల్‌ తరంగ సైతం తిలకరత్నె దిల్షాన్‌ నేతృత్వంలోని ఆ జట్టులో ఆడనున్నారు. మార్చి 5న ‌ బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో ఇండియా లెజెండ్స్ తలపడనుంది. మార్చి 6న శ్రీలంక లెజెండ్స్‌.. వెస్టిండీస్‌ లెజెండ్స్‌తో పోరాడనుంది. సిరీసులోని అన్ని మ్యాచులు షాహిద్‌ వీర్‌ నారాయణ్‌‌సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతాయి.

ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ సిరీసు ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలి ఎడిషన్‌లో నాలుగు మ్యాచులు జరిగాక 2020, మార్చి 11న కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ మొదలవ్వనుంది.

ఇండియా లెజెండ్స్‌: సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా, నోయెల్‌ డేవిడ్‌, మునాఫ్ పటేల్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, మన్‌ప్రీత్‌ గోనీ, యూసుఫ్‌ పఠాన్‌, నమన్‌ ఓజా, ఎస్‌ బద్రీనాథ్‌, వినయ్‌ కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని