ఈ సిరీస్‌లో మరో చాహల్‌ను చూస్తారు: యుజీ

టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ రాబోయే శ్రీలంక సిరీస్‌లపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కొద్దికాలంగా అనుకున్నంత మేర రాణించలేకపోతున్న అతను స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన...

Updated : 20 Sep 2022 15:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ రాబోయే శ్రీలంక సిరీస్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కొద్దికాలంగా అనుకున్నంత మేర రాణించలేకపోతున్న అతను స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ చోటు సంపాదించలేకపోయాడు. ఇప్పుడు లంక పర్యటనకు ఎంపికవ్వడంతో తన బౌలింగ్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఇక్కడ రాణించి తన స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు. తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో ముచ్చటించిన చాహల్‌ పలు విషయాలు పంచుకున్నాడు.

‘ఇటీవల నా ప్రదర్శన గురించి మాట్లాడితే నేను ఫామ్‌ కోల్పోయాయని భావించడం లేదు. మనం ప్రతిమ్యాచ్‌లో అద్భుతంగా రాణించలేము. ఎప్పుడు ఆడినా నేను అత్యుత్తమ ప్రదర్శన చెయ్యడానికే ప్రయత్నిస్తా. ఈ పర్యటన నాకెంతో ముఖ్యమైనది. నా బౌలింగ్‌ గురించి ఎప్పుడూ బౌలింగ్‌ కోచ్‌తో సంప్రదింపులు చేస్తుంటాను. జట్టు యాజమాన్యం నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. అందుకే నేనిప్పుడు ఇక్కడున్నాను. ఇప్పుడు నా ధ్యాసంతా ఈ సిరీస్‌పైనే ఉంది. ఏడాది కాలంగా క్రికెట్‌ ఆడటం తక్కువైనా పరిస్థితులు మన చేతుల్లో లేవు. ఇప్పుడు నా అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలున్నాయి. వాటిమీదే దృష్టిసారిస్తున్నాను. ఈ సిరీస్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న చాహల్‌ను మీరు చూస్తారు’ అని అతను పేర్కొన్నాడు.

కాగా.. టీమ్‌ఇండియా, శ్రీలంక జట్ల మధ్య తొలుత ఈనెల 13 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభంకావాల్సి ఉంది. అయితే, లంక జటులో ఇద్దరు సహాయక సిబ్బంది కరోనా బారినపడటంతో టోర్నీని ఐదు రోజులు వెనక్కి రీషెడ్యూల్ చేశారు. తాజాగా బీసీసీఐ సెక్రెటరీ జైషా మాట్లాడుతూ ఈనెల 18 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుందని వెల్లడించారు. మరోవైపు క్వారంటైన్‌లో ఉన్న లంక ఆటగాళ్లకు తాజా పరీక్షల్లో నెగిటివ్‌ వస్తే వారితోనే నిర్వహించాలని శ్రీలంక బోర్డు భావిస్తోంది. అలా కుదరని పక్షంలో మరో జట్టుతో ఆడించాలని చూస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని