CWC Qulifiers: స్కాట్లాండ్‌ చేతిలో ఓడిన జింబాబ్వే.. ప్రపంచ కప్‌ రేసు నుంచి ఔట్

వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో మరో సంచలనం నమోదైంది. జింబాబ్వేపై స్కాట్లాండ్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Published : 04 Jul 2023 21:42 IST

బులవాయో: వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో మరో సంచలనం నమోదైంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌.. స్కాట్లాండ్‌పై ఓడిపోయి ప్రధాన టోర్నీకి అర్హత సాధించని విషయం తెలిసిందే. తాజాగా అదే స్కాట్లాండ్‌ జట్టు.. జింబాబ్వేకూ షాకిచ్చింది. ఆ జట్టుపై 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో జింబాబ్వే ప్రపంచ కప్‌ రేసు నుంచి నిష్క్రమించింది. స్కాట్లాండ్ తన తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారీ తేడాతో ఓడిపోతే మాత్రం ప్రపంచ కప్‌నకు అర్హత సాధించే అవకాశాలు దెబ్బతింటాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకేల్ లీస్క్ (48), మాథ్యూ క్రాస్ (38), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (34), మున్సే (31) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సీన్‌ విలియమ్స్‌ 3, చతార 2, నగరవ ఒక వికెట్ పడగొట్టారు. ఈ లక్ష్యఛేదనలో జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. ర్యాన్ బర్ల్ (83), వెస్లీ మధ్వేరే (40), సికిందర్‌ రజా (34) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోలే 3, మెక్‌ముల్లెన్ , మైకేల్ లీస్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని