MWC 2021 : టెక్ పండగ వస్తోంది.. ఏం తెస్తుందో?
Mobile World Congress 2021కి అంతా సిద్ధం...
ఇంటర్నెట్ డెస్క్: కొత్త కొత్త మొబైళ్లు, గ్యాడ్జెట్ల, సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏటా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) నిర్వహిస్తుంటారు. కరోనా పరిస్థితుల వల్ల గతేడాది ఈ మొబైళ్ల పండగ జరగలేదు. ఈ ఏడాది వర్చువల్‌లో నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం (జూన్ 28) మధ్యాహ్నం నుంచి జులై 1 వరకు స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతుంది. అక్కడ ఈ ఏడాది పరిచయం చేయబోయే అంశాల గురించి మీరూ చదివేయండి!
✫ MWC అంటే ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థలు, టెక్ కంపెనీలు ముందుకొచ్చేవి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. గూగుల్, నోకియా, షావోమి, ఫేస్బుక్, సోనీ లాంటి సంస్థలు హాజరు కావడం లేదు.
✫ ఈ ఏడాది MWCలో టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశాల్లో స్పేస్ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ కీనోట్. ఇంటర్నెట్ శాటిలైట్ ప్రాజెక్టు స్టార్‌లింక్ గురించి ఆయన ఈ వర్చువల్ ఈవెంట్లో మాట్లాడనున్నారు. ఆయనేం చెబుతారనే విషయంలో చాలా ఆసక్తి నెలకొంది.
✫ శాంసంగ్ నుంచి ఈ ఏడాది కొత్తగా మొబైల్స్ ఏవీ ఈ ఈవెంట్లో తీసుకురాకపోవచ్చని తెలుస్తోంది. శాంసంగ్ స్మార్ట్ వాచ్‌ల సిరీస్‌లో కొత్తగా గెలాక్సీ వాచ్ 4ను తీసుకురాబోతోంది. దానినే ఈ ఈవెంట్లో ప్రదర్శిస్తారని సమాచారం.
✫ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5జీ విభాగాల్లో కొత్త ఉత్పత్తులు, సాంకేతికతకు సంబంధించిన కొత్త ఉత్పత్తులను ఇంటెల్ MWCలో ఆవిష్కరించబోతోందని తెలుస్తోంది.
✫ లెనోవో నుంచి కొన్ని కొత్త ల్యాప్‌టాప్‌లు, క్రోమ్‌బుక్స్, కంప్యూటర్లకు సంబంధించిన యాక్సెసరీలను ఈ ఈవెంట్లో పరిచయం చేయబోతున్నారట. థింక్‌ప్యాడ్ ఎక్స్1 ఎక్స్ట్రీమ్ జెన్ 4, థింక్‌ప్యాడ్ ఎల్ 13 జెన్ 2, ఎల్ 13 యోగా జెన్ 2, ఐడియా ప్యాడ్ 5ఐ క్రోమ్ బుక్, ఐడియా ప్యాడ్ ఫ్లెక్స్ 5ఐ క్రోమ్ బుక్ 2 ఇన్ 1, లెనోవో గో పీసీ యాక్సెసరీలు ప్రదర్శిస్తారట.
✫ టీసీఎల్ నుంచి నెక్స్ట్‌వేర్ G పేరుతో స్మార్ట్ గ్లాసెస్ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. ఈ గ్లాసెస్‌లో చిన్నపాటి స్పీకర్లు కూడా ఉన్నాయట. ఇందులో మైక్రో ఓఎల్ఈడీ స్క్రీన్లు ఉంటాయి.
✫ MWCలో డీలింక్ కూడా కొత్త ఉత్పత్తులను ప్రదర్శించనుంది. 5జీ ప్రైవేట్ నెట్వర్క్స్, క్లౌడ్ మేనేజ్డ్ క్యాంపస్ నెట్వర్క్స్, ఎస్ఎంబీ నెట్వర్క్స్, స్మార్ట్ హోం నెట్‌వర్క్స్‌ను ఈ ఈవెంట్లో ప్రదర్శించనున్నారని సమాచారం.
✫ తమ కొత్త 5జీ ప్లాట్‌ఫామ్స్ గురించి వేదికపై వివరించడానికి ఎన్విడియా కూడా సిద్ధమవుతోంది. ఇటీవల రూపొందించిన ఆసక్తికరమైన 5జీ నెట్వర్క్ ఉత్పత్తుల గురించి వివరిస్తారట.
✫ హువావే నుంచి ఈ ఏడాది మరో కొత్త ఫోల్డబుల్ మొబైల్‌ను MWCలో వివరిస్తారని వార్తలొస్తున్నాయి. పీ50 రేంజిలో ఈ మొబైల్ ఉంటుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
కంప్యూటర్‌కు బుర్ర!
మన మెదడు అద్భుతమైంది. హేతుబద్ధంగా వ్యవహరిస్తుంది. కార్య కారణాలను విశ్లేషించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఉచితానుచితాలను బేరీజు వేస్తుంది. ఏ పని ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో పసిగడుతుంది. -
ఫోన్ ట్యాప్ అయ్యిందా?
నేటి డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార గోప్యత, భద్రత అతి కీలకమయ్యాయి. అధునాతన నిఘా పద్ధతుల నేపథ్యంలో ఇవి మరింత ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి. నిత్య జీవితంలో విడదీయలేని పరికరంగా మారిన ఫోన్ల మీదా నిఘా వేయటం, ట్యాపింగ్ చేయటమూ చూస్తున్నాం. -
రోబో సేవలు చేసేనే..
మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. -
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం