ఊసరవెల్లి వజ్రాలు!

మామూలుగా ఉన్నప్పుడు ఒక రంగులో, చాలా చల్లటి వాతావరణంలో మరో రంగులో. ఇలా రంగులు మార్చే వజ్రాలు ఇప్పుడు ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి. అరుదైనవే అయినా ఇలాంటి వజ్రాలు కొత్తవేమీ కావు. వీటిని 1886లోనే గుర్తించారు. సుమారు 200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వరకు వేడి చేసినా

Updated : 13 Oct 2021 04:43 IST

మామూలుగా ఉన్నప్పుడు ఒక రంగులో, చాలా చల్లటి వాతావరణంలో మరో రంగులో. ఇలా రంగులు మార్చే వజ్రాలు ఇప్పుడు ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి. అరుదైనవే అయినా ఇలాంటి వజ్రాలు కొత్తవేమీ కావు. వీటిని 1886లోనే గుర్తించారు. సుమారు 200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వరకు వేడి చేసినా, 24 గంటల కన్నా ఎక్కువసేపు చీకట్లో ఉంచినా ఇవి ఆకుపచ్చ రంగు నుంచి ఊదా లేదా పసుపు రంగులోకి మారతాయి. తాజాగా శాస్త్రవేత్తలు మరో కొత్తరకం ఊసరవెల్లి వజ్రాలను గుర్తించారు. ద్రవ నత్రజనిలో లేదా -196 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత వరకు చల్లబరిచితే ఇవి బూడిద రంగు నుంచి పసుపు రంగులోకి మారిపోవటం విశేషం. వీటినే అతిశీతల (క్రయోజెనిక్‌) వజ్రాలనీ పిలుచుకుంటున్నారు. వజ్రాల్లోని అణువులు తక్కువగా కంపించేలా చేయటానికి ప్రయోగశాలల్లో వజ్రాలను చల్లబరచటం మామూలే. ఇది వజ్రాలను మరింత కచ్చితమైన కొలతలతో కత్తిరించటానికీ వీలు కల్పిస్తుంది. ఇందుకోసం కొందరు ద్రవ నత్రజనిని వాడుతుంటారు. ఈ క్రమంలోనే కొత్తరకం అరుదైన వజ్రాలు బయటపడ్డాయి. అతి చల్లదనమే వీటికి అరుదైన గుర్తింపు తెచ్చిపెడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని