Twitter: వాట్సాప్‌ తరహాలో ట్విటర్‌లో కొత్త ఫీచర్‌.. ఏంటో తెలుసా?

గతంలో మనం చేసిన చాట్‌లను సులువుగా వెతకడం కోసం ‘సెర్చ్‌ డైరెక్ట్‌ మెసేజ్‌’ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ట్విటర్‌ వెల్లడించింది.

Updated : 11 May 2022 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ తరహాలోనే ట్విటర్‌ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇతరులకు గతంలో పంపిన మెసేజ్‌లను సులువుగా వెతకడం కోసం ‘సెర్చ్‌ డైరెక్ట్‌ మెసేజ్‌’ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు తాజాగా వెల్లడించింది. దీనితో చాట్‌ పేజీలోని సెర్చ్‌ బార్‌లో కీ వర్డ్స్‌ను టైప్‌ చేసి మనకు కావాల్సిన మెసేజ్‌లను తెలుసుకోవడానికి ఈ ఫీచర్‌ పనిచేయనుంది.

‘‘డైరెక్ట్‌ మెసేజ్‌లను వెతకడానికి యూజర్లు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. ఇక కీ వర్డ్స్‌ను ఉపయోగించి మీకు కావాల్సిన మెసేజ్‌లను కనుగొనడానికి ‘సెర్చ్‌ డైరెక్ట్ మెసేజ్‌’ ఫీచర్‌ను తీసుకువస్తున్నాం’’ అని కంపెనీ ఓ ట్వీట్‌లో పేర్కొంది.

డైరెక్ట్‌ మెసేజ్‌ ఫీచర్‌ ఇంతకుముందు గ్రూప్‌ పేర్లను, అందులో ఉన్న వ్యక్తుల వివరాలను తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. తాజాగా యూజర్ల కాంటాక్ట్స్‌లో ఉన్న వారి వివరాలతో పాటు వారితో చేసిన చాట్‌లను సైతం సులువుగా వెతకడానికి ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ఈ సెర్చ్ బటన్ యాప్ హోమ్ స్క్రీన్‌పై ఉంటుంది. ఈ ఫీచర్ ఆధారంగా మనం పంపిన, రిసీవ్ చేసుకున్న మెసేజ్‌లను సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. కాగా.. డైరెక్ట్‌ మెసేజ్‌ ఫీచర్‌ ఇప్పటికే వాట్సాప్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌లలో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని