logo

పేదింటి బిడ్డ..చదువుల్లో దిట్ట!

కూలీ పనిచేసుకుంటూ కుమారుడిని చదివించారు ఆ తల్లిదండ్రులు.. ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి ఉద్యోగం సాధించి తమ కష్టాలు తీర్చుతాడన్నది వారి ఆశ. అందుకనుగుణంగానే కష్టపడి చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ

Updated : 29 Jan 2022 05:45 IST

ఆర్థిక సాయానికి ఎదురుచూపులు

శ్రీనాథ్‌

కూలీ పనిచేసుకుంటూ కుమారుడిని చదివించారు ఆ తల్లిదండ్రులు.. ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి ఉద్యోగం సాధించి తమ కష్టాలు తీర్చుతాడన్నది వారి ఆశ. అందుకనుగుణంగానే కష్టపడి చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వచ్చిన అతడికి ఇప్పుడు డబ్బు రూపంలో పెద్ద అడ్డంకే ఎదురైంది. మానవత్వంతో స్పందించి సాయం చేసేవారి కోసం ఇప్పుడా పేద కుటుంబం ఆశగా ఎదురుగా చూస్తోంది. భీమదేవరపల్లి మండలం ములుకనూర్‌కు చెందిన అలుగు రాజకొంరయ్య - మంజుల దంపతులు ఉన్న ఎకరం పొలం సాగు చేస్తూ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరి కుమారుడు శ్రీనాథ్‌ చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. పదో తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్‌లో 99 శాతం మార్కులు, కిట్‌్్స కళాశాలలో మెకానిక్‌ ఇంజీనిరింగ్‌ (2015-21) పూర్తి చేసి 90 శాతం మార్కులు సాధించి సత్తా చాటాడు. ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలో ఉత్తమ పాయింట్లు సాధించి జర్మనీలోని ఒట్టోవాన్‌ గ్యూరిక్‌ ఇంజనీరింగ్‌ విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ ఇన్‌ కెమికల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో ఉచితంగా సీటు సాధించాడు. అక్కడ విద్య అభ్యసించాలంటే రూ.12లక్షల వరకు ఖర్చవుతుందని.. తల్లిదండ్రులు తెలిసిన వారి వద్ద డబ్బులు కోసం ప్రయత్నించినా ఇచ్చేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. స్థానిక జడ్పీటీసీ సభ్యుడు వంగ రవీందర్‌ స్పందించి సాయం కోసం తెలిసినవారికి సమాచారం పంపించినట్లు పేర్కొన్నారు. దాతలు ముందుకు వచ్చి శ్రీనాథ్‌ విదేశీ చదువులకు తోడ్పాటు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

- న్యూస్‌టుడే, భీమదేవరపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని