Published : 23 Jan 2022 05:08 IST

రాష్ట్రంలో 41 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు పదోన్నతి

 ముఖ్య కార్యదర్శులుగా శైలజ, శ్రీధర్‌, నదీం, వీరబ్రహ్మయ్య

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో 41 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 29 మంది ఐఏఎస్‌, 12 మంది ఐపీఎస్‌ అధికారులున్నారు. 1997 బ్యాచ్‌కి చెందిన శైలజారామయ్యర్‌, ఎన్‌.శ్రీధర్‌, అహ్మద్‌నదీం, వీరబ్రహ్మయ్యలకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. 2006 బ్యాచ్‌కు చెందిన రొనాల్డ్‌రాస్‌, భారతీలఖ్‌పతి నాయక్‌, విజయేంద్ర, సురేంద్రమోహన్‌లకు కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. 2009 బ్యాచ్‌కి చెందిన సత్యనారాయణ, అర్విందర్‌ సింగ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఎం.ప్రశాంతిలు అదనపు కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. 2013 బ్యాచ్‌కు చెందిన కె.శశాంక, శృతి ఓజా, సీహెచ్‌ శివలింగయ్య, వి.వెంకటేశ్వర్లు, హన్మంతరావు, అమోయ్‌కుమార్‌, కె.హైమావతి, ఎం.హరిత, కేంద్ర సర్వీసులో ఉన్న అద్వైత్‌ కుమార్‌సింగ్‌లకు సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతులు లభించాయి. 2017 బ్యాచ్‌కు చెందిన రిజ్వాన్‌ భాషా షేక్‌, 2018 బ్యాచ్‌కు చెందిన అనుదీప్‌ దురిశెట్టి, కోయ శ్రీహర్ష, అభిలాష, కుమార్‌దీపక్‌, ఆదర్శ్‌ సురభి, హేమంత్‌ బోర్కండే, నంద్‌లాల్‌పవార్‌లకు ఉప కార్యదర్శులుగా పదోన్నతులు వచ్చాయి. పదోన్నతులు పొందిన ఐఏఎస్‌లు కొత్త హోదాలతో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగాలని ప్రభుత్వం ఆదేశించింది. 12 మంది ఐపీఎస్‌లకు అదనపు డీజీపీలు, ఐజీలుగా, సెలక్షన్‌ గ్రేడ్‌ అధికారులుగా పదోన్నతి కల్పించింది. వీరిలో 1997 బ్యాచ్‌కి చెందిన విజయ్‌కుమార్‌, నాగిరెడ్డి, డీఎస్‌.చౌహాన్‌, సంజయ్‌కుమార్‌ జైన్లకు అదనపు డీజీపీలుగా పదోన్నతి లభించింది. 2005 బ్యాచ్‌కి చెందిన తరుణ్‌జోషి, వి.శివకుమార్‌, వీబీ కమలాసన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్‌ శ్రీనివాస్‌లకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. 2008 బ్యాచ్‌ అధికారి తఫ్సీర్‌ ఇక్బాల్‌కు డీఐజీగా, 2009 బ్యాచ్‌కు చెందిన రెమా రాజేశ్వరి, అంబారి కిషోర్‌ఝాలకు సెలెక్షన్‌ గ్రేడ్‌ అధికారులుగా హోదా ఇచ్చింది. పదోన్నతులు పొందిన ఐపీఎస్‌లు కొత్త హోదాలతో ప్రస్తుతం ఉన్న పోస్టుల్లోనే కొనసాగాలని ఉత్తర్వుల్లో సూచించింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని