KTR: బ్లాక్‌ ఫంగస్‌కు ఔషధాలు కావాలా?

బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు అంఫోటెరిసిన్‌ ఔషధం కావాల్సిన వారు సంబంధిత వైద్యుని ప్రిస్క్రిప్షన్‌తో కలిసి రాష్ట్ర వైద్య

Updated : 20 May 2021 10:10 IST

డీఎంఈకి మెయిల్‌ చేయండి
లక్షణాలు ఉన్నవారు కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో చేరండి
బాధితులకు ట్విటర్‌లో కేటీఆర్‌ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు అంఫోటెరిసిన్‌ ఔషధం కావాల్సిన వారు సంబంధిత వైద్యుని ప్రిస్క్రిప్షన్‌తో కలిసి రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడి (డీఎంఈ)కి dme@telangana.gov.in  ఈమెయిల్‌ పంపించాలని, దానిని పరిశీలించి అవసరమైన వారికి ఇంజక్షన్లను సమకూరుస్తారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం ట్విటర్‌లో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు బాధితుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు ఇంజక్షన్లు కోరగా ఆయన ఈ సమాచారాన్ని పంచుకున్నారు. కరోనాతో కోలుకున్న వారికి బ్లాక్‌ఫంగస్‌ నిర్ధారణ అయితే కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో చేరాలని, కరోనా ఉన్నప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ వస్తే ‘గాంధీ’ లో చికిత్స ఉందని వివరించారు.
మా అమ్మను చూడాలని ఉంది  
హైదరాబాద్‌లో ఉన్న తన తల్లి కరోనాతో బాధపడుతోందని, ఆమెను చూడడానికి తాను నెదర్లాండ్స్‌ నుంచి రావాలనుకుంటున్నానని, తనకు అవకాశం కల్పించాలని అంజి అనే నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌లో కోరారు. అతన్ని రప్పించేందుకు తాము ప్రయత్నం చేస్తామని, వచ్చాక నిబంధనల మేరకు హోం ఐసొలేషన్‌లో ఉండాలని కేటీఆర్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని