AP News: ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు శిక్ష
న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 8 మంది ఐఏఎస్ అధికారులపై హైకోర్టు కన్నెర్ర చేసింది. సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో వీరికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ శిక్ష పడినవారిలో గోపాల కృష్ణ ద్వివేది (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి), ఎం.గిరిజాశంకర్ (పౌరసరఫరాలశాఖ కమిషనర్, పంచాయతీరాజ్‌శాఖ పూర్వ కమిషనర్), బి.రాజశేఖర్ (పాఠశాల విద్యాశాఖ
తొలుత రెండు వారాల జైలు
క్షమాపణలు కోరిన అధికారులు
జైలు శిక్ష నిలుపుదల చేసి సామాజిక సేవా శిక్ష విధించిన ఏపీ హైకోర్టు
వసతి గృహాలకు నెలకోసారి వెళ్లి... భోజన ఖర్చులను భరించాలని ఆదేశం
పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాలను తీసేయాలన్న ఉత్తర్వుల అమల్లో అధికారులది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమేనని వ్యాఖ్య
న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పు
ఈనాడు - అమరావతి
న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 8 మంది ఐఏఎస్ అధికారులపై హైకోర్టు కన్నెర్ర చేసింది. సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో వీరికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ శిక్ష పడినవారిలో గోపాల కృష్ణ ద్వివేది (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి), ఎం.గిరిజాశంకర్ (పౌరసరఫరాలశాఖ కమిషనర్, పంచాయతీరాజ్‌శాఖ పూర్వ కమిషనర్), బి.రాజశేఖర్ (పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), వాడ్రేవు చిన వీరభద్రుడు (గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్, పాఠశాల విద్య పూర్వ కమిషనర్), జె.శ్యామలరావు (ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పురపాలకశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి) ఉన్నారు.
ఇంకా వై.శ్రీలక్ష్మి (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ, పూర్వ ముఖ్య కార్యదర్శి), జి.విజయకుమార్ (ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి, పురపాలకశాఖ పూర్వ డైరెక్టర్), ఎం.ఎం నాయక్ (పురపాలకశాఖ కమిషనర్, పురపాలకశాఖ పూర్వ డైరెక్టర్) ఉన్నారు. శిక్ష విధింపుపై కోర్టుకు ఏమైనా చెప్పదలచుకున్నారా? అని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అడిగిన ప్రశ్నకు ఐఏఎస్‌లు ఒకరి తర్వాత ఒకరుగా క్షమాపణలు కోరారు. ఆదేశాల అమలులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకూ అందించిన సేవలు, వయసును దృష్టిలో పెట్టుకొని క్షమించాలని కోరారు. ఆ క్షమాపణలను మానవతా దృక్పథంతో న్యాయస్థానం అంగీకరించాలంటే.. సామాజిక సేవ చేసేందుకు సిద్ధమేనా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు వారు అంగీకారం తెలపడంతో.. ఏడాదిపాటు నెలకోసారి ఏదో ఒక ఆదివారం సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో కొంత సమయం గడపాలని ఐఏఎస్‌లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. విద్యార్థులకు ఆ పూట భోజనం ఖర్చులను సొంతంగా భరించాలని ఆదేశించారు. ఏయే జిల్లాలకు ఎవరెవరు వెళ్లాలో న్యాయమూర్తే తెలిపారు. ప్రతి నెలా వసతి గృహాలను సందర్శించిన వివరాలు, ఫొటోలను హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌కు పంపాలని స్పష్టం చేశారు. ఇలా చేయడంలో విఫలమైతే వారిపై కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు రిజిస్ట్రీ తిరిగి తెరిచేందుకు వెసులుబాటు ఇచ్చారు. అధికారులకు జైలుశిక్షను నిలుపుదల చేస్తూ.. సామాజిక సేవా శిక్షను విధించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఈ మేరకు తీర్పు వెల్లడించారు.
నేపథ్యమిదే...
ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, నిర్మాణాలు సరికాదని, వాటిని తొలగించాలని 2020 జూన్ 11న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఏడాదికి పైగా ఆ ఉత్తర్వులను అధికారులు పట్టించుకోలేదు. దీంతో 2021 జులై 12న అప్పటి పంచాయతీరాజ్, పురపాలకశాఖ, పాఠశాల విద్యాశాఖకు చెందిన సీనియర్ ఐఏఎస్‌లపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుచేసింది. తర్వాత కాలంలో ఆ శాఖల బాధ్యతలను నిర్వహించిన ఐఏఎస్‌లను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో మొత్తం 8 మంది ఐఏఎస్‌లపై సుమోటో కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. గురువారం తీర్పును వెల్లడించింది.
సీనియర్ ఐఏఎస్‌ల నుంచి ఈ తరహా శైలిని ఊహించలేదు
‘అధికారులు దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలిస్తే 1,371 పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు తెరిచేవరకూ వాటి తొలగింపునకు, మధ్యంతర ఉత్తర్వుల అమలుకు అధికారులు చర్యలు చేపట్టలేదు. 2021 సెప్టెంబరులో పాఠశాలల నుంచి సచివాలయాలు, భరోసా కేంద్రాలను ఖాళీ చేయించారు. పేద, మధ్యతరగతి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారన్నది అందరికీ తెలిసిన విషయమే. సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేవరకూ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టే పేదల విషయంలో వారి తీరు అర్థమవుతోంది. చట్ట ప్రకారం పని చేయడం అధికారుల బాధ్యత. కోర్టు ఆదేశాలను అధికారులు ఉల్లంఘించడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. సీనియర్ ఐఏఎస్‌ల నుంచి ఈ తరహా అలసత్వం, చట్టం పట్ల అగౌరవ శైలిని న్యాయస్థానం ఊహించలేదు. ఇది దురదృష్టకరం. కోర్టు ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్‌భవన్‌లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్‌కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్‌ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్‌కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్‌లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్‌లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం