
కొత్త వైద్య కళాశాలల్లో 100 చొప్పున సీట్లు
అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన 8 వైద్య కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులోభాగంగా ఒక్కో కళాశాలలో 100 చొప్పున సీట్లు, జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారం 430 పడకలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో జిల్లా, ఏరియా ఆస్పత్రులను గుర్తించి వాటిలో అదనపు పడకలను సమకూర్చనుంది. వైద్య కళాశాలల ఏర్పాటు కోసం నిర్మాణ, పరికరాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థకు వైద్యవిద్య సంచాలకులు కె.రమేష్‌రెడ్డి లేఖ రాశారు. కళాశాలల్లో చదివే విద్యార్థులకు వసతి గృహాలు తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు. జనగామ జిల్లా ఆస్పత్రిలో 200 పడకలు అందుబాటులో ఉన్నాయని, మరో 230 పడకలు కల్పించాలని తెలిపారు. భూపాలపల్లి ఆస్పత్రిలో 40, కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో 280, ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో 30, ఆసిఫాబాద్ సీహెచ్‌సీలో 45, సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో 30, వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో 280 పడకల అవసరముందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral video: మొసలిని పెళ్లాడిన మేయర్.. అంగరంగవైభవంగా వేడుక!
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
-
Sports News
IND vs ENG: నిలకడగా ఆడుతున్న జోరూట్, బెయిర్‌స్టో
-
India News
Punjab: పంజాబ్ కేబినెట్ విస్తరణ.. కొత్తగా మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
E-Mobility: టేబుల్ మీద తింటూ.. టేబుల్‌తో సహా ప్రయాణించి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు