ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని జేఎన్‌యూ ప్రొఫెసర్‌ సుర్జీత్‌ మజుందార్‌ పిలుపునిచ్చారు.

Published : 23 May 2022 04:16 IST

జేఎన్‌యూ ప్రొఫెసర్‌ సుర్జీత్‌ మజుందార్‌ పిలుపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని జేఎన్‌యూ ప్రొఫెసర్‌ సుర్జీత్‌ మజుందార్‌ పిలుపునిచ్చారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగం తనంతట తానుగా ప్రైవేట్‌ కార్పొరేట్‌ రంగం వృద్ధికి బాటలు వేస్తోందని తెలిపారు. గత 30 ఏళ్లుగా సంఘటిత రంగంలో ఉద్యోగులు, కార్మికుల సగటు వేతనాల్లో పెరుగుదల లేదని, ఉద్యోగాలు తగ్గాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌ రంగానికి స్వేచ్ఛ ఇస్తే సంపద సృష్టిస్తుందని, ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పే విషయాలు ఆచరణలో జరగడం లేదన్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌ మాట్లాడుతూ.. కేంద్రం రాజ్యాంగ లక్ష్యాలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేయస్‌యస్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

జాతీయ అధ్యక్షుడిగా కేసీ హరికృష్ణన్‌ ఎన్నిక  
విజయవాడలో జరిగిన స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మహాసభల్లో జాతీయ అధ్యక్షులుగా కేరళకు చెందిన హరికృష్ణన్‌, ప్రధానకార్యదర్శిగా సీఎన్‌ భారతి ఎన్నికైనట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని