ఊపిరి పీల్చుకున్న పోలీసులు

వేల మంది పోలీసుల పహారా మధ్య భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు కార్యక్రమం సజావుగా జరిగిపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Published : 03 Jul 2022 06:19 IST

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, మాదాపూర్‌: వేల మంది పోలీసుల పహారా మధ్య భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు కార్యక్రమం సజావుగా జరిగిపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిరసనకారులు రోడ్లపైకి దూసుకొచ్చే అవకాశం ఉందన్న నిఘా సమాచారం మేరకు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల రాకపోకలను గోప్యంగా ఉంచారు.వారికి పటిష్ఠ భద్రత కల్పించారు. వారు ప్రయాణించే మార్గాల్లో పోలీసులను అప్రమత్తం చేశారు. హెచ్‌ఐసీసీ, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, నాంపల్లి, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో నిరసన తెలియజేసేందుకు సిద్ధమైన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమై, అజ్ఞాతంలోకి వెళ్లిన మరికొందరు నాయకులు, కార్యకర్తల ఆచూకీ గుర్తించి గృహనిర్బంధంలో ఉంచారు. మరోపక్క మాదాపూర్‌ పరిసరాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో పెద్దగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురుకాలేదు. మాదాపూర్‌, హెచ్‌ఐసీసీ, కొండాపూర్‌ ప్రాంతాల్లోని కొన్ని హోటళ్లు, సూపర్‌మార్కెట్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయించారు. హెచ్‌ఐసీసీ ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర సుమారు 5000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రధాని పర్యటనలో ఎస్పీజీ ఆదేశాల మేరకు పోలీసులు నాలుగంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియా, పోలీసు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా తిరగకుండా ఆంక్షలు విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని