సుప్రసిద్ధ గాయని పి.సుశీలకు ‘రోశయ్య స్మారక జీవన సాఫల్య పురస్కారం’

మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా శ్రీవాసవీ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సుప్రసిద్ధ గాయని పి.సుశీలకు ‘రోశయ్య

Updated : 05 Jul 2022 06:06 IST

న్యూస్‌టుడే, రవీంద్రభారతి: మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా శ్రీవాసవీ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సుప్రసిద్ధ గాయని పి.సుశీలకు ‘రోశయ్య స్మారక జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆమెకు ఈ అవార్డును అందజేశారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక, అజాతశత్రువు డా.కొణిజేటి రోశయ్య అని ఆయన అన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌, ఎమ్మెల్యేలు అన్నా వెంకటరాంబాబు, మద్దాలి గిరిధర్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఏపీ మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌రావు, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, తెలంగాణ పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్తా, దైవజ్ఞశర్మ, ఏపీ మానవ హక్కుల కమిషన్‌ పూర్వ ఛైర్మన్‌ పెదపేరిరెడ్డి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని