చెక్క సైకిల్‌.. బాగుంది ఎంచక్కా..!

చిత్రంలో కనిపిస్తున్న సైకిల్‌ పూర్తిగా చెక్కతో తయారు చేయబడింది. సిద్దిపేట గ్రామీణ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేశ్‌చారి, సురేశ్‌చారి సోదరులు కర్రతో వివిధ రకాల కళాకృతులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

Updated : 07 Aug 2022 05:48 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట: చిత్రంలో కనిపిస్తున్న సైకిల్‌ పూర్తిగా చెక్కతో తయారు చేయబడింది. సిద్దిపేట గ్రామీణ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేశ్‌చారి, సురేశ్‌చారి సోదరులు కర్రతో వివిధ రకాల కళాకృతులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నరేశ్‌చారి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. సురేశ్‌చారి ఐటీఐ, డిగ్రీ అభ్యసించారు. వారి నాన్న రామచంద్రానికి వడ్రంగి వృత్తిలో సహకారం అందిస్తున్నారు. పనిలో ప్రత్యేకత చాటేలా వీరిద్దరూ ఇప్పటి వరకు 40 రకాల బొమ్మలు, పరికరాలను తయారు చేశారు. వీటిలో తుపాకి, కంప్యూటర్‌ మౌస్‌, ఆడుకునేందుకు జారుడు నిచ్చెన, పెన్‌డ్రైవ్‌, క్యూబ్‌, సీసా, కాఫీ కప్పు, క్రికెట్‌ వరల్డ్‌కప్‌ నమూనా, మహాత్మాగాంధీ విగ్రహం తదితర ఉత్పత్తులు వీరు తయారు చేసిన వాటిలో ఉన్నాయి. తాజాగా సైకిల్‌ను పూర్తిస్థాయిలో కర్రతో రూపొందించారు. గొలుసు కూడా చెక్కతోనే తయారు చేయడం విశేషం. దీని తయారీకి రెండు నెలల సమయం పట్టిందన్నారు. ఈ సైకిల్‌పై విజయవంతంగా నాలుగు కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు వారు తెలిపారు. రెండేళ్ల కిందట kswoodencrafting పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించారు. అందులో ఎప్పటికప్పుడు వారు తయారు చేస్తున్న ఉత్పత్తుల వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. భిన్నమైన ఆలోచనతో ముందడుగు వేస్తున్న సహోదరులు.. రానున్న రోజుల్లో కారు తయారీ లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని