ఈ డోలీ మోత చాలా తేలిక

గర్భిణులు, అనారోగ్యానికి గురైన గిరిజనులను ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం గూడేల్లోకి రాలేని పరిస్థితి. దీంతో కర్రకు డోలి కట్టి భుజాలపై మోస్తూ కిలోమీటర్ల కొద్దీ అడవి మార్గంలో ప్రధాన రహదారికి చేరుకొని అక్కడి నుంచి వాహనంలో

Published : 15 Aug 2022 06:43 IST

గర్భిణులు, అనారోగ్యానికి గురైన గిరిజనులను ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం గూడేల్లోకి రాలేని పరిస్థితి. దీంతో కర్రకు డోలి కట్టి భుజాలపై మోస్తూ కిలోమీటర్ల కొద్దీ అడవి మార్గంలో ప్రధాన రహదారికి చేరుకొని అక్కడి నుంచి వాహనంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇలా మోయడం కష్టం కావడంతో సులభంగా ఉండేలా మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లికి చెందిన షణ్ముఖరావు ఓ పరికరాన్ని తయారు చేశారు. డోలికి ఉండే కర్ర స్థానంలో ఐరన్‌ పైప్‌ ఉపయోగించి.. దానికి రెండు సైకిల్‌ చక్రాలను బిగించారు. పైపు మధ్యలో డోలి కట్టి అందులో రోగిని కూర్చోబెట్టి తీసుకెళ్లొచ్చు. రహదారిపై వెళ్లే సమయంలో మోసే వ్యక్తులపై భారం పడకుండా చక్రాల సహాయంతో నెడుతూ.. దారి సరిగా లేనప్పుడు చక్రాలను పైకి జరిపి డోలిలా మోసుకెళ్లొచ్చు. ఈ పరికరాన్ని మహబూబాబాద్‌ జిల్లా ఎన్టీఆర్‌ స్టేడియంలో సోమవారం జరిగే స్వాతంత్య్రదిన వేడుకల్లో ప్రదర్శించేందుకు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఎంపిక చేసిందని షణ్ముఖరావు తెలిపారు.           

- ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని