బిల్లులు ఆపింది వివరాల కోసమే

భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలకు తోడ్పాటుగా ఉండాలని అనుకుంటున్నారని గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యానించారు.

Updated : 29 Nov 2022 06:04 IST

గవర్నర్‌ తమిళిసై

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలకు తోడ్పాటుగా ఉండాలని అనుకుంటున్నారని గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలకు పోటీగా వ్యవహరించాలని భావించడంలేదని అన్నారు. తమిళనాట కోయంబత్తూరులోని ఓ కళాశాల స్నాతకోత్సవంలో ఆమె సోమవారం పాలొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో భిన్నంగా ఉన్నది ప్రభుత్వమేనని, గవర్నర్‌ కాదని ఆమె పేర్కొన్నారు. వివరాలు కోరుతూ తన వద్ద కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆలస్యం చేయాలని అనుకోలేదని ఆమె చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలకు సంబంధించిన బిల్లు ప్రజలకు ఉపయోగకరమో కాదో పరిశీలించి సంతకం చేస్తానని చెప్పారు. దీన్ని ఆలస్యం చేయడం అనే కంటే కొంతసమయం తీసుకున్నట్లుభావించాలని కోరారు. తెలంగాణలో గవర్నర్‌ ప్రసంగాన్ని నిరాకరించినా, బడ్జెట్‌ దాఖలుకు ఇబ్బంది పెట్టలేదన్నారు. ప్రజలు గవర్నర్‌ను కలవొచ్చని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని