27న విధుల్లో చేరాలంటూ.. 29న ఉత్తర్వులు!

రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్‌ కేటగిరీ కింద పలువురు ఉపాధ్యాయులను జిల్లాలకు కేటాయించింది.

Published : 31 Jan 2023 04:31 IST

కరీంనగర్‌ జిల్లాలో స్పౌజ్‌ ఉపాధ్యాయులకు పోస్టింగులు

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం స్పౌజ్‌ కేటగిరీ కింద పలువురు ఉపాధ్యాయులను జిల్లాలకు కేటాయించింది. ఇలా కరీంనగర్‌ జిల్లాకు రెండు విడతల్లో 75 మంది ఇతర జిల్లాల నుంచి వచ్చారు. వివిధ కారణాల వల్ల వారికి పోస్టింగులు ఇవ్వడంలో ఆలస్యమైంది. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి దాటాక నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఈనెల 27న సాయంత్రం ఆయా పాఠశాలల్లో రిపోర్టు చేయాలంటూ 29న విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిని పట్టుకొని వారు సోమవారం (30న) పాఠశాలల్లో చేరేందుకు వెళ్లగా, కొందరు ప్రధానోపాధ్యాయులు చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో విషయాన్ని వారు డీఈవో జనార్దన్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేస్తామని చెప్పారన్నారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించగా.. విద్యాశాఖకు రిపోర్టు చేసిన తేదీ నుంచి వారిని విధుల్లో చేర్చుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని