ఘనంగా 36వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కూరెళ్ల విఠలాచార్య ప్రదర్శన ప్రారంభించి మాట్లాడుతూ మంచి పుస్తకం మనిషిలో అనేక మార్పులు తీసుకొస్తుందని, మహాత్ములనూ చేస్తుందని అన్నారు.

Published : 10 Feb 2024 04:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో 36వ జాతీయ పుస్తక ప్రదర్శన శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కూరెళ్ల విఠలాచార్య ప్రదర్శన ప్రారంభించి మాట్లాడుతూ మంచి పుస్తకం మనిషిలో అనేక మార్పులు తీసుకొస్తుందని, మహాత్ములనూ చేస్తుందని అన్నారు. అనంతరం పుస్తక ప్రదర్శనను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి ఎన్నో రుగ్మతలతో సతమతం అవుతున్నారని.. వాటన్నింటికి విరుగుడు పుస్తకమే అని చెప్పారు. సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి ఆర్నెల్లకు ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీనియర్‌ పాత్రికేయులు శ్రీనివాస్‌రెడ్డి, సుధాభాస్కర్‌, బుక్‌ఫెయిర్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని