మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!

కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి.

Updated : 20 Apr 2024 04:45 IST

తెలంగాణ ఓటరు కార్డుతో హాజరైన కొందరు

ఈనాడు, ఆదిలాబాద్‌, న్యూస్‌టుడే, కెరమెరి: కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. ఆ గ్రామాల ప్రజలకు రెండు రాష్ట్రాల్లోని ఓటరు కార్డులుండగా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ గ్రామాలకు వార్డు సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి వరకు ఇద్దరు చొప్పున ఉంటారు. లోక్‌సభ ఎన్నికల్లో తొలివిడతలో భాగంగా శుక్రవారం మహారాష్ట్రలోని చంద్రపూర్‌ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. కొందరు ఓటర్లు తెలంగాణ ఓటరు కార్డు, ఇంకొందరు మహారాష్ట్ర ఓటరు కార్డు తీసుకొని రాగా..మరికొంత మంది మాత్రం తెలంగాణ, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓటరు కార్డులతో వచ్చి ఓటేశారు. ఓటరుకు నచ్చిన ఏదో ఒక్క చోటే ఓటు వేసేలా ఎన్నికల అధికారులు ఇక్కడ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని