నేత్రాధికారులకు న్యాయం చేయాలి

రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్స్‌)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది.

Published : 01 May 2024 04:43 IST

పీఆర్సీ ఛైర్మన్‌కు నేత్రాధికారుల సంఘం వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్స్‌)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్‌ శివశంకర్‌ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. సంఘం అధ్యక్షుడు ప్రతాపగిరి ప్రసాద్‌, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌, ఇతర నేతలు రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌, చంద్రశేఖర్‌, రాజశేఖర్‌, రవి, శివ, శ్రీనాథ్‌, జగన్‌ తదితరులు శివశంకర్‌ను బీఆర్‌కే భవన్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. 36 ఏళ్లుగా పదోన్నతులు కల్పించపోవడంతో అదే పోస్టులో పదవీ విరమణ పొందుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుండగా కేవలం 145 నేత్రాధికారుల పోస్టులు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. తమ కేడర్‌ను సూపర్‌న్యూమరరీ నుంచి తొలగించాలని, పదోన్నతులతో పాటు గెజిటెడ్‌ హోదా కల్పించాలన్నారు. సంఘం తెలిపిన అంశాలను పీఆర్సీలో చేరుస్తామని శివశంకర్‌ హామీ ఇచ్చినట్లు ప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని