సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..

భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి.

Published : 01 May 2024 05:29 IST

తీవ్రమైన ఎండలతో జలాశయాల్లో పెరుగుతున్న ఆవిరి
రోజూ వెయ్యి క్యూసెక్కులకుపైనే మాయం

ఈనాడు, హైదరాబాద్‌: భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. జలాశయాల పరిధిలో కిలోమీటర్ల కొద్దీ నీరు విస్తరించి ఉండటం వల్ల ఎండలకు వేగంగా ఆవిరవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు.

అడుగంటిన ప్రధాన ప్రాజెక్టులు

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు మరింతగా అడుగంటాయి. జూరాల, పులిచింతల గత ఏడాదితో పోల్చితే కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.

  •  నాగార్జునసాగర్‌ జలాశయంలో ఆవిరి శాతం అధికంగా ఉంది. మార్చి నెలాఖరున రోజుకు 312 క్యూసెక్కుల చొప్పున ఆవిరవగా సోమవారం 677 క్యూసెక్కులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 123.67 టీఎంసీలు ఉన్నాయి.
  •  శ్రీశైలం జలాశయంలో సోమవారం 234 క్యూసెక్కుల ఆవిరి ఉండగా ఈ ఏడాది ఆరంభంలో 172 క్యూసెక్కులు మాత్రమే ఉంది. 215.81 టీఎంసీలకు గాను 33.34 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
  •  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 291 క్యూసెక్కుల నీరు రోజూ ఆవిరి అవుతోంది. 90.31 టీఎంసీలకుగాను 10.61 టీఎంసీలు ఉన్నాయి.
  •  జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 142 క్యూసెక్కుల ఆవిరి నమోదైంది. ఇక్కడ ఫిబ్రవరిలో 95 క్యూసెక్కుల నష్టం మాత్రమే ఉంది. 9.66 టీఎంసీలకు గాను 2.81 టీఎంసీలే ఉన్నాయి.
  •  పులిచింతలలో 100 క్యూసెక్కుల ఆవిరి నష్టం నమోదైంది. 45.77 టీఎంసీల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం కాగా 1.36 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని