7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్‌.కృష్ణయ్య

రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 01 May 2024 04:44 IST

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో బీసీ సంఘాలతో పాటు కుల సంఘాల నేతలు పాల్గొనే సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన పాత్రపై చర్చిస్తామని పేర్కొన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల అమలుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీల సంక్షేమానికి ఏటా రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ప్రకటన చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని