ఓయూలో సర్క్యులర్‌ ప్రచారంపై పోలీసు కేసు

సర్క్యులర్‌ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Published : 01 May 2024 04:39 IST

ఎఫ్‌ఐఆర్‌లో భారాస నాయకుడు క్రిశాంక్‌తోపాటు మరికొందరి పేర్లు

లాలాపేట, న్యూస్‌టుడే: సర్క్యులర్‌ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేసవి సెలవులపై గత సంవత్సరం జారీ చేసిన సర్క్యులర్‌ను మార్చి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని చీఫ్‌ వార్డెన్‌ శ్రీనివాస్‌ కోరారు. ఐపీసీ 466, 468, 469, 505(1)(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకోవడంపాటు ఎఫ్‌ఐఆర్‌లో భారాస నాయకుడు క్రిశాంక్‌తోపాటు మరికొందరి పేర్లు చేర్చినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజేందర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని