50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు

హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 01 May 2024 05:52 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 50 మంది రచయిత్రులకు మాతృవందనం పురస్కారాలు అందజేసి సన్మానించారు. తెలుగువర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో జవహర్‌లాల్‌ నెహ్రూ వాస్తుకళ, లలితకళల విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య కవిత దరియాణిరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  మహిళా రచయిత్రులను గుర్తించి సత్కరించడం అభినందనీయమని, అమ్మలు ఇళ్లనే కాదూ రచనల ద్వారా సమాజాన్ని సంస్కరించగలరని ఆమె పేర్కొన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. అమ్మను మించిన దైవం లేదన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌, చిత్రవాణి డిప్యూటీ డైరెక్టర్‌ అయినంపూడి శ్రీలక్ష్మీ, ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు రాణి నల్లమోతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని