పానీపూరీ ప్రియుల డ్రీమ్‌ మెషీన్‌

పానీపూరీ ప్రియుల డ్రీమ్‌ మెషీన్‌ వీడియోను మీరూ చూసేయండి..

Updated : 16 Sep 2020 19:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు సాయంత్రమైతే చాలు పానీపూరి బండి కనిపిస్తే ఆగిపోయేవాళ్లం. ఓ ప్లేటు పూరీ లోపలేస్తే గానీ మనసు సహించేది కాదు. అలాంటిది కరోనా పుణ్యమా అని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పానీపూరిని ఎంతగానో ఇష్టపడే వారు సైతం అటుగా వెళ్లడమే మానేశారు. అలాంటి వారి కోసమే ఈ  ఆటోమేటిక్‌  మెషీన్‌. ఓ ఐఏఎస్‌ అధికారి దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

ఈ మెషీన్‌ను ముట్టుకోకుండానే సెన్సర్‌ల ద్వారా పనిచేస్తుంది. పూరి తీసుకుని మనకు ఇష్టమైన ఫ్లేవర్‌ ఉన్న నాజిల్‌ దగ్గర పెడితే దానిలోకి పానీ పడటం ఈ యంత్రం ప్రత్యేకత. ఖట్టా-మీఠా, గార్లిక్‌-జల్‌జీరా, ధనియా-పుదీనా ఫ్లేవర్లలో ఏది కావలిస్తే దానిని తీసుకునేందుకు వీలుగా ఈ యంత్రాన్ని రూపొందించారు. కరోనా కాలంలో ఇదే ‘ద బెస్ట్‌ మెషీన్‌’ అంటున్నారు నెటిజన్లు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ నగరంలోని తేలిబంధా ఏరియాలో ఉందట ఈ పానీపూరీ ప్రియుల డ్రీమ్‌ మెషీన్‌. మనమక్కడకు వెళ్లలేం గానీ వీడియో చూసి ఆనందించండి..



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని