సింహాన్ని నిలువరించిన శునకం..

సాధారణంగా అడవికి రారాజు సింహం అంటారు. అడవిలో ఏ జంతువునైనా సింహం తన పంజా, గర్జనతో  భయపెడుతుంది.  కావున దానితో పోరాడటం ఏ జంతువు వల్ల కాదు.. కానీ ఇక్కడ ఓ వీధి శునకం ఆడ సింహంతో పోరాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  తొంభై నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి ప్రవీణ్‌ కాస్వాన్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు...

Updated : 11 Jan 2021 23:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సాధారణంగా అడవికి రారాజు సింహం అంటారు. అడవిలో ఏ జంతువునైనా సింహం తన పంజా, గర్జనతో  భయపెడుతుంది.  కావున దానితో పోరాడటం ఏ జంతువు వల్ల కాదు.. కానీ ఇక్కడ ఓ వీధి శునకం ఆడ సింహంతో పోరాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి ప్రవీణ్‌ కాస్వాన్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.  ఈ వీడియోలో ఆడ సింహం  తరుముతున్నా.. ఆ శునకం వెనుదిరిగి సింహంతో పోరాడుతున్న దృశ్యాన్ని పర్యాటకులు కొద్ది దూరంలోని జీపులో నుంచి వీక్షిస్తున్నారు. 

   కుక్కను ఆడసింహం కొంత దూరం తరముకుంటూ వచ్చింది.  ఈ క్రమంలో  కుక్క ఆగి వెనక్కి తిరిగి సింహంపై ఎదురుదాడికి దిగింది. గట్టిగా మొరుగుతూ.. ఒక పెద్ద పిల్లితో పోరాడినట్లుగా సింహాన్ని వెనక్కి తరిమింది.  దీంతో సింహం వెనకడుగు వేసింది. అనంతరం శునకం  అక్కడి నుంచి పరుగెత్తింది. వీధి కుక్క  సింహంతో పోరాడటం గొప్ప విషయం. జీవితంలో ఈ విధమైన నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది  అని కాస్వాన్‌ ట్వీట్‌ చేశారు.   ఇప్పటికే ఈ వీడియోకు  1.6 లక్షల వీక్షణలు వచ్చాయి.   ప్రకృతి చరిత్రలో ఇది ఒక క్రేజీ సందర్భం అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.    


ఇవీ చదవండి..

కొండదారిలో బస్సు డ్రైవర్‌ గుండె ధైర్యం!

రూ. లక్షసంచితో కోతి పరార్‌.. వృద్ధుడి తిప్పలు

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని