ఉద్యోగ జీవితంలో ఇలా బ్యాలెన్స్‌ చేసుకోవాలి..

రిపోర్టర్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Published : 18 Jan 2021 23:49 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ ఉద్యోగంలోనైనా ఎంతో కొంత ఇబ్బంది, రిస్క్‌ ఉంటూనే ఉంటాయి. ఇక పాత్రికేయ వృత్తిలో ఐతే అనేక పన్లను ఒకే సమయంలో చేయాల్సి ఉంటుంది.. ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. ఏదేమైనా వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలన్స్‌ చేయటం అందరికీ ముఖ్యమే. మరి దానిని ఓ రిపోర్టర్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇంతకీ దీనిలో ఏముందంటే..

అన్వర్‌ నైట్‌ అనే వ్యక్తి, కెనడాలోని టొరాంటోలో అక్కడి వాతావారణాన్ని గురించి లైవ్‌లో రిపోర్టింగ్‌ చేస్తున్నాడు. కాస్త ఎత్తైన చోట నిలబడి, ఆ ప్రాంతంలో మంచు కురుస్తున్న పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో  అడుగు కాస్త ముందుకు వేయటంతో.. కాలుజారి ఆ మంచులోనే కిందికి వెళ్లిపోయాడు. ఇంతజరిగినా కింద పడకుండా బ్యాలెన్స్‌ చేసుకోవటం గమనార్హం.
కాగా, ఈ సంఘటన అంతా సంబంధిత టీవీలో లైవ్‌లో ప్రసారమైంది. అనంతరం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయటంతో.. అన్వర్‌ పడిపోకుండా మేనేజ్‌ చేసిన తీరు నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. మరి లైఫ్‌లో ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలో చెప్పే ఈ వీడియోను మీరూ చూసేయండి..

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని