సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులేవి?
close
Published : 05/12/2021 16:29 IST

సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులేవి?

హాయ్‌ మేడమ్‌. నాకు ఇటీవలే పెళ్లైంది. మాకు అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. అందుకోసం సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులు ఏమున్నాయో చెప్పగలరు. అలాగే గర్భం రాకూడదంటే రుతుచక్రంలో అండం విడుదలయ్యే రోజుల్ని ఎలా లెక్క పెట్టుకోవాలి? ఆ రోజుల్లో కలవకుండా, ఇతర రోజుల్లో కలిసినా గర్భం వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా? దయచేసి సలహా ఇవ్వండి. - ఓ సోదరి

జ: ప్రస్తుతం మనకు ఎన్నో రకాల సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అయితే అందరికీ ఒకే పద్ధతి పని చేయకపోవచ్చు. ఎవరికి ఏ పద్ధతి సరైనది అని తెలుసుకోవడానికి డాక్టర్లు ఎన్నో విషయాలు పరీక్షించి చూస్తారు. ఉదాహరణకు.. మీ కుటుంబ చరిత్ర, జీవనశైలి, ఆరోగ్యం.. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఇక అండం విడుదలయ్యే రోజులంటే.. ఇది కూడా మీ రుతుక్రమం ఎన్ని రోజులకోసారి వస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మామూలుగా నెలసరి రావడానికి 14 రోజుల ముందుగా అండం విడుదలవుతుంది. అంటే.. మీరు 10వ రోజు నుంచి 20వ రోజు వరకు రోజు విడిచి రోజు కలిసి ఉంటే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇతర రోజుల్లో కలిసి ఉంటే గర్భం వచ్చే అవకాశాలు తక్కువే అయినా పూర్తిగా రాదని చెప్పలేం. ఎందుకంటే ఒక్కోసారి రుతుచక్రంలో అండం ఏ రోజైనా విడుదల కావచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని