Justin Trudeau: ‘మేం ముందే ఈ విషయాన్ని భారత్‌కు చెప్పాం’: ఆగని ట్రూడో వ్యాఖ్యలు

నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా ప్రధాని ట్రూడో(Justin Trudeau) భారత్‌పై నిందలు వేయడం మానడం లేదు. మరోసారి భారత్‌కు ఆగ్రహం తెప్పించేలా వ్యాఖ్యలు చేశారు. 

Updated : 23 Sep 2023 11:13 IST

ఒట్టావా: భారత్‌(India)ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే.. కెనడా(Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయమైన సమాచారాన్ని కొద్దివారాల క్రితమే భారత్‌కు కెనడా వెల్లడించిందని ట్రూడో చెప్పారు. తాజాగా మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు.

‘సోమవారం నేను మాట్లాడిన విశ్వసనీయ సమాచారం గురించి కొన్ని వారాల క్రితమే భారత్‌కు వెల్లడించాం. ఈ విషయంలో మేం భారత్‌తో నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సీరియస్‌ అంశంలో వాస్తవాలను గుర్తించేందుకు వారు(భారత్‌) మాతో కలిసిపనిచేస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్‌

ఖలిస్థానీ అంశంపై భారత్‌-కెనడా మధ్య విభేదాలు కొనసాగుతోన్న వేళ.. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ఆరోపిస్తూ ఇటీవల ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.

జవాబుదారీ ముఖ్యం: బ్లింకెన్‌

ప్రస్తుత వివాదం విషయంలో కెనడాకు భారత్‌ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్( Antony Blinken) పిలుపునిచ్చారు. ‘మేం జవాబుదారీని చూడాలనుకుంటున్నాం. దర్యాప్తు కొనసాగడం, వాస్తవాలు వెలుగులోకి రావడం ముఖ్యం’ అని న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని