China Corona: షాంఘై లాక్‌డౌన్‌ను మరవకముందే.. మళ్లీ అదేస్థాయిలో కొత్త కేసులు..!

ప్రస్తుతం గాంగ్‌ఝౌ నగరం కరోనా వైరస్ కేంద్రంగా మారింది. అక్కడ కొద్దిరోజులుగా రెండువేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి.

Updated : 11 Nov 2022 10:52 IST

బీజింగ్‌: కరోనా మహమ్మారి చైనాను వదలడంలేదు. దశలవారీగా వైరస్ ఆ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. వైరస్ కట్టడికి అనుసరిస్తోన్న జీరో కొవిడ్ విధానంతో చైనీయులు విలవిల్లాడుతున్నారు. తాజాగా బీజింగ్‌, జెంగ్‌ఝౌ నగరాల్లో భారీగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్క శుక్రవారమే 10,535 మందికి వైరస్ సోకింది. ఏప్రిల్ 29 తర్వాత ఇవే అత్యధికం కావడం గమనార్హం. 

ప్రస్తుతం గాంగ్‌ఝౌ నగరం కరోనా వైరస్ కేంద్రంగా మారింది. అక్కడ కొద్దిరోజులుగా రెండువేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. జనాభా అధికంగా ఉన్న హైఝులో ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడంతో ఆదివారం వరకు కఠిన లాక్‌డౌన్ విధించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఇంట్లో ఒక్కరు మినహా ఎవరూ బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇక బీజింగ్‌, జెంగ్‌ఝౌ, చాంగ్‌కింగ్‌లో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. జెంగ్‌ఝౌలో ఒక్కరోజులో కొత్త కేసులు రెట్టింపు అయ్యాయి. తాజా వ్యాప్తితో అక్కడి అతిపెద్ద యాపిల్ అసెంబుల్‌ కేంద్రం ఇబ్బందుల్లో పడింది. చాంగ్‌కింగ్‌లో కొద్దిరోజులుగా వందల సంఖ్యలోనే కేసులు వస్తున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. బీజింగ్‌లో కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ ముఖ్యమైన కార్యాక్రమాలను అధికారులు వాయిదా వేశారు.  జెంగ్‌ఝౌ, చాంగ్‌కింగ్‌లో దాదాపు  50 లక్షల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారు. కొద్ది నెలల క్రితం షాంఘై నగరంలో విధించిన లాక్‌డౌన్ ఆంక్షలతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడ్డారు. దానికి సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు